అంతటా మాస్క్ తప్పనిసరి!
- గాలి ద్వారా సోకుతున్న డెల్టా వైరస్
- ఇంటా, బయట మాస్క్ ధరించాలి డి.హెచ్ శ్రీనివాస్ రావు హెచ్చరిక
హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): డెల్టా వైరస్ గాలి ద్వారా సోకుతుందని, ఇంటా, బయట మాస్క్ ధరించాలని డి.హెచ్ శ్రీనివాస్ రావు హెచ్చరించారు. డెల్టా వెరియంట్ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ఏప్రిల్ నుండి నవంబర్ వరకు మొదటి వేవ్ జరిగిందని చెప్పారు. రాబోయే 2,3 నెలలు సెకండ్ వేవ్ ప్రభావం ఉంటుందని తెలిపారు. కరొనా వైరస్ ముప్పు ఇంకా తగ్గలేదన్నారు. సీఎం ఆదేశాల మేరకు 7జిల్లాలు 11 ప్రాంతంలో వైద్య ఆరోగ్య శాఖ తిరిగి చూడటం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో పొలిటికల్ యాక్టివిటి ఎక్కువ అయ్యిందని, ఎక్కువ గుంపులు సమూహాలూ లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. రాజకీయ నాయకులు ఎవ్వరు కరొనా నిబంధనలు పాటించడం లేదని, మాస్క్ పెట్టుకోవడం లేదన్నారు. వైరస్ కంట్రోల్ చెయడం కోసం లక్ష వరకు టెస్టులు
చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యం ద్రుష్టిలో పెట్టుకొవాలని రాజకీయ నాయకులకు విఙప్తి చేశారు. ఇంకా రెండు
సంవత్సరాలు కరొనా వైరస్‌తో పోరాడాల్సి ఉంటుందని తెలిపారు.
