అధికారం.. అగ్రహం.. సమయం వృధాపై మండిపాటు
- ఎమ్మెల్యే రసమయి మైక్ కట్..
- డిప్యూటి స్పీకర్ పద్మారావు గౌడ్ పై అగ్రహం
- అధికార పార్టీకి సైతం.. ప్రతిపక్షం మాదిరిగానే..
హైదారాబాద్, టీఎస్ డ్రీమ్స్ : అసెంబ్లీ బడ్జేట్ సమావేశాల సందర్భంగా డిప్యూటి స్పీకర్, అధికార పార్టీ ఎమ్మెల్యే నడుమ వ్యాగ్యుద్ధం జరిగింది. క్వశ్ఛన్ అవర్ లో ఈ అసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నియోజకవర్గ సమస్యలపై ప్రశ్నలు అడుగుతుండగా డిప్యూటి స్పీకర్ పద్మారావు గౌడ్ తన మైక్ కట్ చేశారంటూ మానకోండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పీకర్ పై అసహనం వ్యక్తం చేశారు. సమయం వృధా చేయ్యోద్దు.. గంటన్నరలో పది మంది అవకాశం వినియోగించుకోవాలని డిప్యూటి స్పీకర్ పద్మారావు గౌడ్ కోరగా.. మైక్ దొరికిందని ప్రతిపక్ష లాగే తన స్వరాన్ని వినిపిస్తున్న ఆ అధికార పార్టీ సభ్యుడు.. బాలకిషన్ మాట వినకపోవడంతో ఇరువురి మద్య కొంత వాగ్వాదం జరిగింది. వచ్చిన అవకాశం వినియోగించుకోవాలే అంటూ సుతిమెత్తగా మందలించారు.

రసమయి మాట్లాడుతూ… తమను అసెంబ్లీలో ఎలాగూ మాట్లాడనివ్వరని, కనీసం ప్రశ్నలు కూడా అడగనివ్వక పోతే ఎలా అంటూ ఉప సభాపతిపై ఆయన రుస రుస లాడారు. నియోజకవర్గనికి వెళితే పలు సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారని తాము వారికి ఏం సమాధానం చెప్పాలని ఆయన మదనపడ్డారు. మంత్రులకు ఉండే సమయం కూడా తమకు ఉండదని.. కనీసం మాకు ఓట్లేసి గెలిపించిన ప్రజల తరపునా ప్రజా సమస్యలు చెప్పుకునే అవకాశం లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు.

చాల మంది సీనియర్లు ఉన్నారని, కీలక సమయాల్లో తప్ప తమకు మరేప్పుడు సమయం దోరకదని.. కనీసం ప్రశ్నోత్తరాల్లోనైనా వచ్చిన కొద్దిపాటి సమయాన్ని వినియోగించుకోనే అవకాశం మీలాంటి వారే కల్పించాలని కోరారు. సొంత పార్టీ నేతలకే మాట్లాడే అవాకాశం దక్కకపోవడంపై అయ్యో రామా..! అధికార పార్టీలోనే నేతల పరిస్థితి మరి ఇంతగనం దిగజారిందా? అని అటు పొరుగు పార్టీల నేతలతో పాటు సొంత పార్టీ నేతలు సైతం వామ్మో ధారుణామా అనుకుంటున్నారట. పరిస్థితి ఇలా ఉంటే తమకు ఓట్లేసిన ప్రజలకు ఏం సమాధానం చెప్పుకుంటాం అంటూ లొలోన బాధపడ్తున్నరట..
