అపార్ట్మెంట్ లో చోరీ.. 46 తులాల బంగారం అపహరణ
హైదరాబాద్, టీఎస్ డ్రీమ్స్ : ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరి జరిగింది. స్థానిక కాలనీ ఉండే వాసవి సన్ రైజ్ అపార్ట్మెంట్ లో జరిగిన చోరీలో సుమారుగా 46 తులాల బంగారం అపహరణకు గురైందని బాధిత కుటుంబం పిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
