అ దేవతలు.. బ్రహ్మలోకం నుంచి వచ్చిండ్రా?
ఫైల్.. సమ్మక్క సారక్క సమ్మక్క సారక్కపై దూమారం రేపుతున్న చిన్న జీయర్ వ్యాఖ్యలు...
- సమ్మక్క సారక్క అంటే ఎవరూ?
- వాళ్లేమైనా దేవతలా?.. ఆమే ఎవరో ఓ అడవి దేవతే.!
- గ్రామ దేవత అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్నే రేపుతున్నాయి. చదువుకున్నొళ్లు, వ్యాపారస్థులు తీరుపై నోరుజారిన చిన్నజీయర్
- మా తల్లులది వ్యాపారమా?.. ఎమ్మెల్యే సీతక్క
- జీయర్ కు సిగ్గుండాలి.! మండుపడుతున్న తెలంగాణ సమాజం

హైదరాబాద్,టీఎస్ డ్రీమ్స్ : సమ్మక్క సారక్క అంటే ఎవరూ?.. వాళ్లేమైనా దేవతలా? బ్రహ్మ లోకం నుంచి దిగివచ్చారా? ఎమిటి చరిత్ర? ఆమే ఎవరో ఓ అడవి దేవత, గ్రామ దేవత అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్నే రేపుతున్నాయి. చదువుకున్నవాళ్లు, పెద్ద పెద్ద వ్యాపారస్థులు అక్కడికి వెళ్తున్న, నమ్ముతున్న కొలుస్తున్న వారిని మూర్ఖులుగా అర్థం వచ్చేలా అభివర్ణించడం శోచనీయం. ఇక, అ పేరు మీద బ్యాంకులు పెట్టారంటూ చిన్నజీయర్ చేసిన అల్పపు మాటలు మెజారిటి హిందువులలో అగ్రహన్నే తెప్పించాయి. గ్రామ దేవతలపై తనలో దాగిఉన్న, నింపుకున్న విషపూరిత భావజాలాన్ని, అహంకార పూరిత నైజంతో వనదేవతలు, పకృతి దేవతలపై చేసిన ఈ దుష్ట, నీచ వ్యాఖ్యలు బయటపడడంతో దేశమంతటా ఆయనపై అగ్రహ జ్వలాలు చెలరేగుతున్నాయి. మనిషి రూపంలో ఉన్న చిన్నజీయర్ అసలు రూపం అలస్యంగా బయటపడడంతో ..ఛ్చీ..ఛ్చీ చీదరించుకుంటున్నారు. పొద్దస్తమానం ఆద్యాత్మికం, దైవం ముసుగులో ఇవేనా చేసేది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నీచలు మాటలు మాట్లాడుతూ… ప్రజల్లో విషజ్వలాలు, వైషమ్యాలు నింపుతూ రేచ్చగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, చిన్నజీయర్ చేసిన తాజా వ్యాఖ్యల మంటలు ఇప్పట్లో చల్లరేటట్లు కనిపించడం లేదు.

వన దేవతలపై అసంకుంచీత వ్యాఖ్యల నేపథ్యంలో.. వైష్టవ గురువులు, ప్రముఖ ఆద్యాత్మిక వేత్త చిన్నజీయర్ స్వామిపై ఎమ్మెల్యే సీతక్క తనదైన శైలీలో మండిపడ్డారు. సమ్మక్క సారలమ్మ మీద అహంకార వ్యాఖ్యలు చేశారంటూ శివంగిలా ఉగ్ర నరసింహుడు అవతారం ఎత్తింది. దాల్చింది. ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయంపై పలువురు గిరిజన, అదివాసిలు చిన జీయర్ కు అంత కండ కావరం ఎందుకు అని మండిపడుతున్నారు. అద్యాత్మిక వెత్తగా, ఓ హిందువు మాట్లాడే మాటలేనా? అవి అంటూ జీయర్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. సమతామూర్తి విగ్రహం చూడాలంటే రూ.150 టికెట్ ధర పెట్టాలి.. మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికేట్ లేదు.. అక్కడ ఏ ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వనవసరం లేదని అన్నారు. చినజీయర్ దుర్మార్గపు మాటలు, ఇలాంటి దుష్ప్రచార వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలని సీతక్క డిమాండ్ చేశారు.

