ఆంధ్ర పాలకులంతా తెలంగాణ ద్రోహులే..
వైఎస్ నీటి దొంగ .. జగన్ గజ దొంగ
లంకలో పుట్టిన రాక్షసుల మాదిరే.. ఈ ఆంధ్ర పాలకులు..
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి: లంకల పుట్టినోళ్లందరూ రాక్షసులేనని.. ఆంధ్రోళ్లు ఎప్పుడూ తెలంగాణ మంచి కోరుకోలేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణకు రావలసిన నీటిని.. ఏపీ అక్రమంగా దోచుకెళ్తుందని ఆయన ఆరోపించారు. తెలంగాణ నీటి హక్కును కాలరాస్తూ… నాడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని అక్రమ తరలింపుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీళ్ల దొంగగా మారితే.. నేడు వారసుడు సైతం తండ్రి బాటలోనే వెళ్తూ జగన్ ఓ గజ దొంగగా మారాడని వేముల సంచలన వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణకు అన్యాయం చేయడంలో నాటి నుంచి నేటి వరకు ఆంధ్ర పాలకులు కక్షగట్టి మరి ఇక్కడి నీటిని దోచుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఎస్, రాయలసీమ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం పోరాటానికి సిద్దమవుతున్నదని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. ఏపీ సర్కార్ దిగిరాకపోతే.. ప్రజా యుద్దం తప్పదన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తే కేసీఆర్ చూస్తూ ఊరుకోరని ఆయన తీవ్రంగా తమదైన శైలిలో హెచ్చరించారు
