January 16, 2026

Tsdreams

INDIAN NEWS NETWORK

తెలంగాణ వ్యాప్తంగా జీయర్ పిలిక(ఫోటో)కు చెప్పుల దండలు

  • సారక్క, సారక్కపై నోరుజారిన త్రిదండి
  • హేలన మాటలపై అగ్రహ జ్వలాలు
  • అహంకార పూరిత వ్యాఖ్యలపై తీవ్రదూమారం..
  • ఆధ్యాత్మికం మాటున ఇతర దేవతల్ని తిట్టడమా?
  • ఒక్కొక్కటిగా బయటపడుతున్న పాత వీడియోలు
  • వీడియోలతో జీయర్ అసలు రూపం
  • వైరల్ మారిన వ్యాఖ్యలు.. జీయర్ పై కౌంటర్లు
  • అంత బలుపు, చిన్నచూపు ఎందుకు? : సీతక్క
  • త్రిదండి కాదు?.. తీటా కొండి : సీపీ(ఐ)ఎం
  • తెలంగాణ వ్యాప్తంగా జీయర్ పిలిక(ఫోటో)కు చెప్పుల దండలు
  • ఖబర్ఢాడ్ అంటూ అఖిలపక్ష సంఘాల హెచ్చరికలు
  • మీడియా ముందు బహిరంగ క్షమాపణకు డిమాండ్
  • సమ్మక్క సారక్కల వద్ద ముక్కు నెలకు రాయాలంటున్న అదివాసి, గిరిజన తెగలు

హైదరాబాద్, టీఎస్ డ్రీమ్స్ : తెలంగాణ అంటే పండుగలు, జాతరలు పకృతితో పరవసింపజేసే వన బోజనాలు, ఉత్సవాలకు పుట్టినిళ్లు. ఊరి పోలిమేరల్లో కొలువై ఉండే దేవతలు, పకృతి ప(పు)లరించేలా చేసే పండుగలు తెలంగాణకే సొంతం. మట్టితో చేసే వినాయక విగ్రహాలు మొదలుకొని, పూలతో చేసే బతుకమ్మ పండుగలు ఇక్కడి నేలకే ప్రత్యేకం. ఆనందం వస్తే పండుగలు చేయడమే కాదు.. తమకు కష్టాలు వస్తే, దేవుడా మా కష్టాలు తీర్చవా? అంటూ మనస్సులో అనుకొని, తమ కష్టాలు, బాధలు, ఆనర్ధాలు, పకృతి ప్రకోపాల నుండి కాపాడమంటూ వేడుకోవడం, పూజించడం ప్రపంచంలో ఎక్కడా లేని అత్యంత మంచి సంప్రాదాయం ఈ గడ్డకు, ఇక్కడి మట్టికి, తెలంగాణ ప్రాంతానికే సొంతం. అంతటి భక్త జన, దైవ మధరాను బంధం, భక్తి కార్యక్రమాలు, కొలాటాలు, పునకాలు, శివసత్తుల విన్యసాలు, ఆట పాటలు తెలంగాణ సంస్కృతిని ప్రతిభింబింప జేస్తాయి. ఎవరి నమ్మకాలు, విశ్వాసాలు వారివి. తమకు నచ్చిన దేవతలను కొలుస్తారు. ఆరాధిస్తారు. పండుగలు చెస్తారు. చేసుకుంటారు. ఇది వారి వారి మత ఆచారాలను బట్టి వారి స్థోమతకు తగ్గట్లుగా పండుగలను చేయడం, చేసుకోవడం, జరుపడం, నిర్వహించడం కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తొంది. ఇదే విషయాన్ని చరిత్ర కూడా చేబుతొంది.

సమ్మక్క సారక్క అంటే ఎవరూ?.. వాళ్లేమైనా దేవతలా? బ్రహ్మ లోకం నుంచి దిగివచ్చారా? ఎమిటి చరిత్ర? ఆమే ఎవరో ఓ అడవి దేవత, గ్రామ దేవత అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్నే రేపుతున్నాయి. చదువుకున్నవాళ్లు, పెద్ద పెద్ద వ్యాపారస్థులు అక్కడికి వెళ్తున్న, నమ్ముతున్న కొలుస్తున్న వారిని మూర్ఖులుగా అర్థం వచ్చేలా అభివర్ణించడం శోచనీయం. ఇక, అ పేరు మీద బ్యాంకులు పెట్టారంటూ చిన్నజీయర్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఓ పదేళ్ల క్రితం చిన్న జీయర్ సమ్మక్క, సారలమ్మలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తాజాగా వైరల్ గా మారడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకారుల ఆగ్రహాజ్వాలలు నివురుగప్పిన నిప్పుల మారాయి. ఆయన మాటలు మెజారిటి హిందువులలో సైతం అగ్రహన్నే తెప్పించాయి.

కానీ, కొందరు తాము ఏం చేస్తున్నామో? వారు ఏం మాట్లాడుతున్నారో? తెలియ(ని)దా? లేకా? తెలిసి కావాలని అవతలి వారి నమ్మకాలు, మనోభవాలను దెబ్బతీసేలా చేస్తుండ్రు. ఇంకొందరు ఈ దేశపు తిండి తింటూ ఇక్కడి గాలి పీలుస్తూ.. ఇక్కడి వనరులు అనుభవిస్తూ పరాయి పాట పాడటం వారి ముర్ఖత్వానికి నిదర్శనం అని చెప్పకతప్నదు. అది వారి ఆజ్ఞానానికి పరాకాష్ట.. వారి విషపు, కుంచీత బుద్దికి తార్కాణం అని చెప్పకతప్పదు. సుమారు 136 కోట్ల ఆఖండ భారత్ లో గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా ఇదే జరుగుతొంది. ఇది మంచిది కాదు?.. సమాజంలో విలువలు గల పెద్ద మనుషులుగా చలమణి అవుతూ.. ఇలాంటి చిల్లర మాటలు, చీఫ్ చెష్టలు, ధర్టీ పాలిట్రిక్స్ తో మనుషుల మధ్యన వర్గ, వర్ణ, లింగ, మత భేదాలు తెస్తూ.. వైషమ్యాలు రేపుతున్నారు. మనిషి ఎదిగితే? జ్ఞానం పెరగాలి.. విజ్ఞానం పెరగాలి, విజ్ఞతగా మెలగాలి.. వారి జీవన విధానం ఇతరులకు ఆదర్శంగా ఉండాలి?. పోరుగు రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ ప్రజల ఇష్ట దేవతలపై నోరు జారడం వేనుక భారీ కుట్రలు లేకపోలేదు? అన్న అనుమానాలను సైతం కలుగుతున్నాయి. ఇది ఓ వర్గం వారి నుంచి వినిపిస్తున్న మాట.

తెలంగాణ రాష్ట్రంలో అడవి బిడ్డలు, గిరిజనుల ఆరాధ్య దేవతలైన సమ్మక్క, సారలమ్మలపై త్రిదండి చిన్న జీయర్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. వీడియో బహిర్గతంతో చిన్న జీయర్ వ్యాఖ్యలు గడ్డి వాముపై పెట్రో మంటల్లా అంటుకుంటున్నాయి. వైరలైతున్న వీడియో పాతదే అయినప్పటికి జీయర్ నోటి దుర్ద కారణంగా అది ఆరని నిప్పులాగా మారింది. స్వామిజీ పేరుతో నామస్మరణ, చేసేవి చిల్లర మాటలా? అంటూ ఎమ్మెల్యే సీతక్క సహ సీపీఐ(ఎం) నేత నారాయణ, గాయకుడు వరంగల్ శ్రీనివాస్, నిర్మాత అశ్వనీదత్, అదివాసి, గిరిజన నేతలు, వందలాది సంఘాలు రోడ్డేక్కాయి. నిరసన దర్నాలతో హోరేక్కాయి. మా దేవతలపై ఇలాంటి నీచపు, కుంచీత బుద్దితో వ్యాఖ్యలు చేస్తే ఆంద్ర దాక తరిమి తరిమి కొడ్తామంటూ హెచ్చరించారు.

ఇదిలాఉంటే, గిరిజనుల తల్లులైన సమ్మక్క, సారలమ్మ జాతరను కించపరిచే విధంగా చిన్నజీయర్ వ్యాఖ్యలపై రాష్ట్రం అంతటా చెప్పుల దండలు, దిష్టిబొమ్మల దహనాలతో ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. ఆదివాసీ గిరిజన సంఘాలు ఇప్పటికే చిన్న జీయర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఆసియాలోనే అతిపెద్ద మహాజాతర ఐన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ పై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమ్మక్క సారలమ్మ జాతరను కించపరుస్తూ చిన్నజీయర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మేడారంలో చిన్న జీయర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చిన్న జీయర్ చిత్రపటానికి చెప్పుల దండలు వేసి ఆదివాసీ గిరిజనులు తమ నిరసన వ్యక్తం చేశారు. అగ్రకులాల అహంకారాన్ని ప్రదర్శిస్తూ చిన్న జీయర్ అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారని ఫైర్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల ప్రజలు, కోట్లాదిమంది మేడారం సమ్మక్క సారలమ్మలను మహిమాన్విత దేవతలుగా నమ్మి పూజిస్తూ ఉంటే, చిన్న జీయర్ సమ్మక్క సారలమ్మ ఎవరు? గ్రామ దేవతలు అంటూ, చదువుకున్న మేధావులు కూడా వారి కోసం వెళుతూ అజ్ఞానంలో బ్రతుకుతున్నారంటూ దుయ్యబడుతున్నారు. కోట్ల జనం కొంగుబంగారమై నిలిచే గిరిజనుల ఆరాధ్య దేవతలపైన చిన్న జీయర్ విమర్శలు చేయడం దారుణమని మండిపడ్తున్నరు. చిన్న జీయర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

అర్ధంకాని భాషలో మంత్రాలు చదువుతూ నిలువు దోపిడీ చేస్తున్నారని ఆదివాసి జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ అన్నారు. దేశంలో 18 శక్తి పీఠాలు గోండు రాజులు పరిపాలిస్తే, వాటిని ఆక్రమించుకుని వ్యాపార కేంద్రాలుగా మార్చుకుని, చెమట చిందించకుండా అర్థం కాని భాషలో మంత్రాలు చదువుతూ నిలువు దోపిడీ చేస్తున్నారంటూ స్వామీజీల పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్న జీయర్ క్షమాపణలు చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టతను, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ ఫైర్ అవుతున్నరు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖబడ్దార్ చిన్నజీయర్.. అంటూ హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.