January 17, 2026

Tsdreams

INDIAN NEWS NETWORK

ఈటల రాజీనామాను ఆమోదించిన స్పీకర్

హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఇటీవల గత కొద్ది రోజుల క్రితం భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయబడిన ఈటల.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించి శనివారం ఆయన.. స్పీకర్‌ను కలిసి స్పీకర్ ఫార్మట్‌లో తన రాజీనామాను సమర్పించారు. ఆ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు. ఉదయం రాజీనామా ఇచ్చిన వెంటనే మధ్యాహ్నం ఆమోదించడం గమనార్హం. ఈటల రాజేందర్ ఆరుసార్లు హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మరో రెండు రోజుల్లో బీజేపీలో చేరనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.