కళ్ళల్లో కారం కొట్టి.. సినీ ఫక్కీలో బంగారం చోరీ
రహదారి పక్కన మూత్ర విసర్జన చేస్తుండగా..చోరీ
హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి) : తెలంగాణ, కోదాడ సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని మొద్దుల చెర్వు స్టేజీ సమీపంలో జాతీయ రహదారి పక్కన సోమవారం రాత్రి యూత్ కాంగ్రెస్ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎస్ఎం పేట గ్రామానికి చెందిన వేనేపల్లి వీరబాబు జాతీయ రహదారి పక్కన మూత్ర విసర్జన చేస్తుండగా గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు రెండు బైక్లపై వచ్చి వీరబాబు కంట్లో కారం చల్లి అతని మెడలో ఉన్న బంగారు చైన్ తో పాటు చేతి వేళ్లకు ఉన్న రెండు ఉంగరాలతో పాటు పరుచూలో వున్న ఎనిమిదివేల రూపాయలను చోరీ చేశారు విషయం తెలుసుకున్న కోదాడ డీఎస్పీ రఘుతో పాటు కోదాడ పట్టణ రూరల్ సీఐలు నర్సింహారావు శివరామిరెడ్డి లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. కాగా, ఈ మేరకు మంగళవారం బాధితుడు వీరబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.
