కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ చర్లపల్లి జైలుకే: పొన్నాల
హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): కాళేశ్వరం నుంచి 50లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడానికి సీఎం కేసీఆర్‌కి సిగ్గుండాలని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం నుంచి 50లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్లు కేసీఆర్ నిరూపిస్తారా అని సవాల్ విసిరారు. తాను సిగ్గులేని వాన్ని కాదు అబద్ధాలు మాట్లాడనని చెప్పారు. డబ్బులిచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి డిస్కవరీ చానల్ లో ప్రసారం చేసుకుంది నిజం కాదా? అని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. కృష్ణా జలాలపై ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపించకుండా సన్యాసిలా ఎందుకు మాట్లాడుతున్నావని పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు. ఏడాదిగా రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపని తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ శిశుపాలునికి మించిన తప్పులు చేశారని. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ శేష జీవితం చర్లపల్లి జైలేనని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
