January 16, 2026

Tsdreams

INDIAN NEWS NETWORK

కాంగ్రెస్ లో క్రమశిక్షణ కరువు

https://tsdreams.in/?p=671
  • రేవంత్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత‌ల భేటీ
  • యమ యమీలకే దిక్కులేక పార్టీలో పడిగాపుల

హైదరాబాద్, టీఎస్ డ్రీమ్స్ : వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాకపోగా నువ్వా నేనా అంటూ కొట్టుకుంటు రచ్చకెక్కుతుండ్రు. దీంతో హండ్రెడ్ ఇయర్స్ హస్తం పార్టీకి ప్రజల్లో సైతం ఆదరణ కరువైంది. పదేళ్లు అధికారానికి దూరమైనప్పటికి వారికి కనివిప్పు కలుగడం లేదు. ఈ వృద్ధ పార్టీని గడీన పెట్టేవారు లేకా ఏ నేత ఏ వర్గమో?.. ఎవరు అసలు కాంగ్రెస్ నేతలో తెలువనంతా డ్యామెజ్ జరిగిపోయింది. కనీసం పార్టీని లైన్ మీదకు తెచ్చె నాధుడే కరువైండ్రని విమర్శలు లేకపోలేదు. వారికి అధికారం రాకపోయిన పర్వాలేదు? కానీ, అంతర్గత విభేదాలు, కుమ్ములాటలకైతే ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. కొన్ని సందర్భాల్లో అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా?.. అనుమానం లేకపోలేదు.. ఇక, అధికార పార్టీతో పాటు విపక్ష పార్టీలు కాంగ్రెస్ ఖతమైంది. కనీసం వెంటిలెటర్ పై పెట్టిన అది బ్రతికి బట్ట కట్టడం కూడా దాదాపు అయిపోయిందని విమర్శలు చేసేవారు లేకపోలేదు.. ఈ మితిమిరిన అంతర్గత ప్రజాస్వామ్యమే వారిని నిలువునా కొంపముంచింది. యమ యమీలు ఏండ్ల పాటు ఏలిన పార్టీలో క్రమశిక్షణ కరువైంది. కాంగ్రెస్ పార్టీని అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ బొంద పెట్టిందని రాజకీయ విశ్లేశకుల మాట.

పాతాళంలోకి పోయిన పార్టీని బ్రతికించుకునేందుకు హస్తం పార్టీ పడరాని పాట్లు పడుతొంది. పోరుగు పార్టీల నుంచి అసంతృప్తి నేతలు, టికేట్ దక్కని వారిని బుజ్జగించి పార్టీలో చెర్చుకుంటొంది. ఇది కొందరు సీనీయర్లకు రూచించడం లేదు.

దీంతో తెలంగాణ రాజ‌కీయల్లో ఒక ఊపు ఊపిన పార్టీపై, కొత్తగా బాధ్యతలు చెపట్టిన బడ నేతలపై అసంతృప్త రాగాలు వ్య‌క్త‌మైన సందర్భాలు అనేకం. ఇప్ప‌టికే తెలంగాణలో రేవంత్ రెడ్డి వ్య‌తిరేకంగా ఆ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు వ‌రుస‌బెట్టి ర‌హ‌స్య భేటీలు నిర్వ‌హించిన విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న జగ్గారెడ్డి వివాదం కొంచేం స‌మ‌సిన‌ట్టే క‌నిపించ‌గా… ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో సీనీయర్లు, మాజీ మంత్రుల వంతు రానే వ‌చ్చింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరును నిర‌సిస్తూ ఆ పార్టీకి చెందిన కీల‌క నేత‌లంతా మంగళవారం నాడు ఓ చోట ప్ర‌త్యేకంగా భేటీ అయ్యార‌ని విశ్వాసనీయ సమాచారం. అయితే, చాల కాలంగా పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న అ పార్టీ సీనియ‌ర్ నేత మర్రి శ‌శిధ‌ర్ రెడ్డి ఇంటిలో జ‌రిగిన భేటీలో.. రేవంత్ తీరును కడిగిపారేశారట. పెనం మీద నీళ్లు పడ్డ చందంగా బ‌హిరంగంగానే విమర్శలు వ్య‌తిరేకించే సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి (జ‌గ్గారెడ్డి) బాటలో మరికొందరు సీనీయర్లు ఉన్నారట. బొళ శంకరుడిగా పేరున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హ‌న్మంత‌రావు, మాజీ మంత్రులు గీతారెడ్డి, పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు, పార్టీ సీనియ‌ర్ నేత కోదండ రెడ్డిల‌తో పాటు మ‌రికొంద‌రు నేత‌లు హాజ‌రైనట్టు ‌తెలుస్తోంది.

సీన‌య‌ర్ల‌ను ప‌ట్టించుకోకుండా రేవంత్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఈ భేటీలో చ‌ర్చ జ‌ర‌గ్గా.. ఈ అంశంపై త్వ‌ర‌లోనే పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాల‌ని నిర్ణయించినట్టుగా స‌మాచారం. మొత్తంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన భేటీలో అసంతృప్త రాగాలు వినిపించడంతో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఓ పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.