కౌశిక్ రెడ్డి నువ్వోక శ్రీరెడ్డి : పత్తి కృష్ణారెడ్డి
సిగ్గు, శరం లేకుండా కౌశిక్ మాట్లాడుతున్నావంటూ ఫైర్
కరీంనగర్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డిపై ఆ పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ముమైత్ ఖాన్‌తో పోలుస్తూ మాట్లాడిన కౌశిక్ రెడ్డిని శ్రీరెడ్డితో పోల్చారు. మంగళవారం నాడిక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సిగ్గు, శరం లేకుండా కౌశిక్ మాట్లాడుతున్నాడంటూ ఫైర్ అయ్యారు. ‘‘కేసీఆర్ ఇచ్చే స్క్రిప్టు చదివే నీకు సిగ్గు ఉండాలి. ముమైత్ ఖాన్‌తో పోలుస్తావా? బిడ్డా.. నువ్వు శ్రీరెడ్డిలా వ్యవహరిస్తున్నావు. నువ్వు, నీ అన్న కోట్లాది రూపాయాలు తీసుకొని జీహెచ్ఎంసీ, జనరల్ ఎలక్షన్లలో టికెట్లు అమ్ముకున్నారు. వైఎస్ నీకు టికెట్ ఇస్తా అని చెప్పిండా, అప్పుడు నీ వయస్సు ఎంత?, చెడ్డిలు కూడ వేసుకోలేదు బిడ్డా’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అత్తాపూర్ సమీపంలోని పెట్రోల్ బంక్, తిరుమల నగర్ పెట్రోల్ బంక్ రెండింటినీ కౌశిక్ లీజు తీసుకున్నారని కృష్ణా రెడ్డి ఆరోపించారు. 25 ఏళ్ల లీజు అగ్రిమెంట్ అయిపోయిందని.. అవి మూత పడ్డాయని చెప్పారు. అత్తాపూర్ పెట్రోల్ బంక్ ఉన్న ప్రభుత్వ స్థలం 25 గుంటలను కబ్జా చేసి కుక్కల ఫామ్ పెట్టారని, నియోజక వర్గంలో ఒకరికి కుక్కల ఫామ్, మరొకరికి కోళ్ల ఫామ్ ఉన్నాయని కృష్ణా రెడ్డి అన్నారు.
