తెలంగాణలో భూముల విలువ 50 శాతం పెంపు
- వ్యవసాయ భూముల కనిష్ట విలువ ఎకరానికి రూ.75 వేలు
- ఓపెన్ ప్లాట్ల కనిష్ట విలువ చదరపు గజానికి రూ.200లు
- అపార్ట్‌మెంట్ కనిష్ట విలువ చదరపు అడుగుకు రూ.వెయ్యి 6 నుంచి 7.5శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు
- ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్నా కూడా పెరిగిన ధరనే
హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): తెలంగాణలో భూముల విలువ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూముల విలువను 50 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
తీసుకుంది. 6 నుంచి 7.5శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం వ్యవసాయ భూముల విలువ 50 శాతం పెంపుదల జరిగింది.వ్యవసాయ భూముల కనిష్ట
విలువ ఎకరానికి రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఓపెన్ ప్లాట్ల కనిష్ట విలువ చదరపు గజానికి రూ.200కు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక అపార్ట్‌మెంట్ కనిష్ట విలువ చదరపు అడుగుకు రూ.వెయ్యికి పెంచారు. ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్నా కూడా పెరిగిన ధరనే చెల్లించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణలో భూముల విలువ పెంపు ఈనెల 22 నుంచి అమల్లోకి రానుంది. కొత్త ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి.
