తెలంగాణ రాష్ట్ర నూతన డిజిపిగా రవి గుప్త నియామకం
హైదరాబాద్, టీఎస్ డ్రీమ్స్, డిసెంబర్ 03: తెలంగాణ రాష్ట్ర నూతన డిజిపిగా రవి గుప్త నియమితులయ్యారు. ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ.. ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేకత చేస్తూ తాజాగా గెలిచిన అభ్యర్థి ఇంటికి వెళ్లి కలవడం పట్ల ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. అత్యున్నత హోదా కలిగిన అధికారిగా ఉండి కూడా, నియమావలుని ఉల్లంఘించడంతో డిజిపి పదవి నుంచి అంజనీ కుమారును తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సస్పెన్షన్ అనంతరం మూడు పేర్లు పంపాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరడంతో.. పేర్లను పంపారు. ఈ మేరకు, సస్పెన్షన్ కి గురై, తొలగింపబడిన అంజని కుమార్ స్థానంలో తెలంగాణ కొత్త డీజీపీగా రవి గుప్తాను నియమిస్తున్నట్లు ప్రకటించింది.

తాజాగా నూతన డిజిపి నియామకానికి సంబంధించి, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కోడ్ ఉల్లంగించిన వారు ఎంతటి వారైనాసరే చర్యలు తప్పవని ఎన్నికలవేళ ఎలక్షన్ కమిషన్ చెప్పకనే చెప్పింది. ఇకమీదట ఇలాంటి చర్యలకు తావివ్వకుండా అధికారులు మారుతారో లేదో వారికే తెలియాలి మరి.
