పీజేఆర్ మృతికి వైఎస్సారే కారణం? : మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి
ఉద్యమంలో ఉన్నవారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన చరిత్ర ఆయనది
నీటి పంచాయితీలతో మళ్లీ గొడవలు వద్దు
హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీటి పంచాయితీలతో మళ్లీ గొడవలు వద్దని హితవు పలికారు. తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తప్పు చేస్తే.. కొడుకు అలా ఉండడు అనుకున్నామన్నారు. తప్పు దిద్దుకుంటారని చర్చలు జరిపామన్నారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తీసుకుని ప్రాజెక్టులు కట్టుకోవాలన్నారు. తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని ఆయన అన్నారు. ఉద్యమంలో ఉన్నవారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని, పీజేఆర్ మృతికి వైఎస్సార్ కారణం కాదా? ఆయన ప్రశ్నించారు.
