January 16, 2026

Tsdreams

INDIAN NEWS NETWORK

పెట్రో వాత..సామాన్యుడిపై ధరల మోత

సబ్సిడీ సిలిండర్‌పై రూ.25.50 పెంపు
Gas Cylinder Price Hike…
దిక్కుతోచని పరిస్థితిలో సామాన్యుడు విలవిలా

హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి); ఓ వైపు పెట్రోల్ ధరలు సెంచరీల మీద సెంచరీలు కొడుతూ..సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న విషయం మరువకముందే ..మరోవైపు గ్యాస్ ధరలు పేరుగుదలతో భగ్గున మండిపడుతున్నాయి. దాటి పరిగెడుతున్న క్రమంలో సామాన్యుడి నెత్తిమీద మరోభారం పడింది. వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. చమురు కంపెనీలు గురువారం వంటగ్యాస్‌ ధరలను పెంచాయి. 14.2 కిలోల బరువున్న సబ్సిడీ సిలిండర్‌పై రూ.25.50 పెంచాయి. పెరిగిన ధరలు ఈరోజు నుంచే (జులై 1,2021) అమలులోకి వస్తాయని సదరు కంపెనీలు తెలిపాయి. దీంతో సామాన్యుడికి మరో భారం తప్పటంలేదు. గ్యాస్ కొనాలంటేనే హడలిపోయేలా ఉన్నాయి ధరలు. ఓ పక్క పెట్రోల్, డీజిల్ ధరలు మరోపక్క గ్యాస్ ధర కూడా పెరగటంతో సామాన్యుడి దిక్కుతోచని పరిస్థితిలో విలవిల్లాడుతున్నాడు.

తాజాగా..ఈ రోజు పెంచిన ధరతో దేశ రాజధానిలో సిలిండర్‌ ధర రూ.834.50కు చేరింది. మరో వైపు 19 కిలోల సిలిండర్‌పై సైతం రూ.76 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో వాణిజ్య సిలిండర్‌ ధర రూ.1550కు చేరువైంది. హైదరాబాద్‌లో వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.16 పెరిగింది. ప్రస్తుతం ధర రూ.861 ఉండగా.. పెంపుతో రూ.877.50కు చేరింది. వాణిజ్య సిలిండర్‌పై రూ.84 పెరగ్గా.. రూ.1768కు పెరిగింది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్‌పీజీ) లేదా కిచెన్ గ్యాస్ రేట్లు ఇవాళ సవరించాయి. ప్రతి ఐదురోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా చమురు కంపెనీలు ఎల్‌పీజీ ధరలను సవరిస్తాయి. ఈక్రమంలో గ్యాస్ ధర మరోసారి పెరిగి సామాన్యుడికి భారంగా మారింది. గత నెలలో వాణిజ్య సిలిండర్ల ధర రూ.122కు చమురు కంపెనీలు తగ్గించాయి. దీంతో 19 కిలో సిలిండర్ రూ.1473.50కు తగ్గింది. అయితే, సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ ఏడాది జనవరి నుంచి సబ్సిడీ సిలిండర్ల ధరలు దాదాపు ఐదుసార్లు పెరిగాయి. చివరి సారిగా మార్చిలో ధరలు పెరగ్గా మరోసారి సామాన్యుడికి ఈ భారం తప్పలేదు.

గత ఏడాదిన్నర కాలంగా ఒ పక్కా ప్రతిరోజు కరోనా వల్ల ఆర్థికంగా నానా కష్టాలు పడుతున్న ప్రజలపై పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పుడు వంట గ్యాస్ ధరలు పెరగటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో సామాన్య మానవుడు కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ అధిక ధరలతో ఇల్లు గడటమే కష్టంగా మారుతోంది. అయినా అంతకంతకూ భారాలు పెరుగుతునే ఉన్నాయి. కానీ, సామాన్యుడు ఆదాయం మాత్రం పెరగకపోగా కరోనా కష్టం వల్ల మరింతగా తగ్గిపోతోంది. ఈక్రమంలో పేదల సంఖ్య పెరుగుతోందని, ఇలా ఉంటే భవిష్యత్లో బ్రతకడమే కష్టంగా మారనుందని సామాన్య మానవుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద, బీద మద్యతరగతి ప్రజల అవసరాలను ద`ష్టిలో ఉంచుకోని ధరలు తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేజారిటి ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.