పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- జితేందర్ రెడ్డి పీఏపై చర్యలు చేపట్టొద్దు
- రాష్ట్ర సర్కార్ కు ధర్మాసనం ఆదేశాలు
- 160 సిఆర్.పిసి నోటీసులను సవాల్ చేస్తూ లంచ్ మోషన్
- మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకుట్రపై విచారణ

హైదరాబాద్, టీఎస్ డ్రీమ్స్ : బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పీఏ రాజుపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పేర్కొంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్య కుట్ర కేసులో జితేందర్ రెడ్డి పీఏ రాజు దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. మంత్రి హత్య, కుట్ర కేసుపై పోలీసుల తీరును న్యాయస్థానం తప్పుబట్టింది. ఈ సందర్భంగా ఖాకీల వ్యవహారంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన పేట్ బషీరాబాద్ పోలీసులు ఇచ్చిన 160 సిఆర్.పిసి నోటీసులను సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు. వచ్చే శుక్రవారం వరకు పీఏ రాజును ఇబ్బందులకు గురి చెయ్యొద్దని ఖాకీలకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అప్పటిదాకా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవరాదని కోర్టు పేర్కొంది. పేట్ బషీర్ బాగ్ పోలీసులకు ఢిల్లీలో ఉన్న రాజును పిలిచి దర్యాప్తు చేసే అధికారం ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. శుక్రవారం వరకు పోలీసులు, పోలీసులు, అధికారులు కోర్టుకు సమాధానం ఇవ్వాలని ధర్మాసనం అదేశించింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు రాజుపై ఎలాంటి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు అదేశించింది.
