January 16, 2026

Tsdreams

INDIAN NEWS NETWORK

ప్రజల్నే పాలకుల్ని జేస్తా : తీన్మార్ మల్లన్న

కేసీఆర్ మా జీతగాడు .. పని చేయకపోతే దించి, ఇంకొకన్ని పెట్టుకుంటాం

ఎవరూ ఏ లీడర్ కు బానిస కావొద్దు.. ఆగస్ట్ 29న 7200 పాదయాత్ర

ఎవరికి లొంగం, కేసులకు బయపడం, రాజ్యాంగ బద్ధంగా 7200 సైన్యం నిర్మాణం

ప్ర‌జ‌ల కేంద్రంగానే రాజకీయాలుండాలి.. పార్టీ గుర్తు చూసి కాదు.. అభ్య‌ర్థిని చూసి ఓటేయాలి

విద్యా, వైద్యంపై పార్టీల అభిప్రాయం తెలపాలి.. ఆగస్ట్ 29 వరకు డెడ్ లైన్

హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): రాబోవు రోజుల్లో తెలంగాణలో ప్రజల్నే పాలకుల్నిజేస్తానని తీన్మార్ మల్లన్న వాఖ్యనించారు. మిమ్మల్నందరిని పాలకులను చేయడమే తన లక్ష్యమని బహుజన బందూక్, సీనియర్ జర్నలిస్టు తీన్మార్ మ‌ల్ల‌న్న పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి తీన్మార్ మలన్న టీమ్ సన్నాహక సమావేశం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొర్రెములలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మనం ఎవరి చేతుల్లోనో పావులు, బానిస కాకూడదన్నారు. రాష్ట్రంలో పేద‌వారికి స‌రైన విద్య‌, వైద్యం అందాలంటే రాజ‌కీయాల‌తోనే సాధ్య‌మ‌ని తీన్మార్ మ‌ల్ల‌న్న పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ను గ‌ద్దె దించేందుకు చాలామంది త‌న‌ను ర‌మ్మన్నార‌న్నారు. ఈ క్ర‌మంలో ఈ మ‌ధ్య తెలంగాణ టీడీపీకి అధ్య‌క్ష ప‌ద‌విని కూడా ఆఫ‌ర్ చేశార‌ని, తాను వాటిని తిర‌స్క‌రించాన‌ని అన్నారు. ప్ర‌జ‌లే కేంద్రంగా రాజకీయాలు ఉండాల‌ని, ప్ర‌జా రాజ‌కీయాలు రావాల‌ని పిలుపునిచ్చారు. తాము అలాంటి రాజ‌కీయాల‌ను తీసుకువ‌స్తాన‌న్నారు. పార్టీ గుర్తు చూసి కాకుండా అభ్య‌ర్థి ప‌నిత‌నాన్ని చూసి ప్ర‌జ‌లు ఓటేయాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా రాజ‌కీయ పార్టీలకు తీన్మార్ మ‌ల్ల‌న్న డెడ్ లైన్ పెట్టారు. ఆగ‌స్టు 29 లోగా అన్ని పార్టీలు విద్య‌, వైద్యంపై అభిప్రాయం ఏమిటో చెప్పాల‌న్నారు. తామేంటో ఇక చూపిస్తామ‌ని హెచ్చ‌రించారు. 40శాతం బ‌డ్జెట్ లో విద్యా, వైద్యానికి ఖ‌ర్చు చేస్తామ‌ని ప్ర‌క‌టించాల‌న్నారు. పాద‌యాత్ర‌లు చేసేవారు దీనికి స‌మాధానం చెప్పాల‌న్నారు. కొన్ని పార్టీలు తాము వస్తే ఆ జెండా, ఈ జెండాను ఎగురవేస్తాం అంటున్నాయని, కానీ గోల్కొండ కోట, ప్రగతి భవన్ పై ఎగిరేది పార్టీ జెండాలు కాదని అక్కడ ఏగిరేది జాతీయ జెండనే అన్నారు. ప్రజలే కేంద్రంగా అభివృద్ధి, సంక్షేమం జరగలన్నారు.


ఆగస్టు 29న నిర్వహించ తలపెట్టిన 7200 పాదయాత్రకు ముఖ్య అతిథిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఆహ్వానించనున్నట్లు తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. 7200 ఉద్య‌మం కొత్త తీరాల‌ను చేరుస్తుందని, అయితే ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో జ‌రిగిన అనేక ఉద్య‌మాల‌లో ప్ర‌జ‌లు చ‌నిపోయారన్నారు. నాయ‌కులంతా కుర్చీల మీద సోకులో ఉన్నారని మ‌ల్ల‌న్న అన్నారు. అయితే తాము చేప‌ట్టే 7200 ఉద్య‌మంలో ఒక్క సామాన్యుడికి కూడా గోరు కూడా గీసుక‌పోనివ్వ‌మ‌ని చెప్పారు. ప్ర‌జాస్వామ్య‌యుతంగా పోరాటం చేస్తూ కొత్త తీరాల‌ను చేర‌కుంటామ‌న్నారు. ఎలాంటి ఘ‌ర్ష‌ణ‌లు లేకుండా, కేవ‌లం బుర్ర ఉప‌యోగించి మాత్ర‌మే పోరాటం చేస్తామ‌ని చెప్పారు. ఈ ఉద్య‌మం త‌రువాత రాజ‌కీయ నాయ‌కులు కూడా ఇళ్ల‌లో నుంచి బ‌య‌ట‌కు రావాలంటే భ‌య‌ప‌డుతార‌ని అన్నారు. కేసీఆర్ మ‌నం ఐదేళ్ల‌కు పెట్టుకున్న జీత‌గాడ‌ని అన్నారు. ప్రస్తుతానికి భారత దేశంలో ఏదైనా అవినీతి రహిత రాష్ట్రం ఢిల్లీ మాత్రమేనన్నారు. డబ్బులు ఇచ్చి అధికారంలోకి రావాలని చూసే పార్టీలు, నేతలను ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లోని ప్రజలు అసలు పట్టించుకోరని తెలిపారు. అంతకు ముందు అకునురి మురళి, లీలా కుమార్ లు అవినీతిని సహించని అధికారులన్నారు. రాజన్న రాజ్యం పేరుతో పొరుగు రాష్ట్రం సీఎం చెల్లెలు ఇటీవల షర్మిల పార్టీని పెడతానంటూ తెలంగాణకు వచ్చిందన్నారు. చెల్లెలు షర్మిల నీ పుట్టుక, నీ ఆధార్ కార్డు పులివెందులలో ఉన్న మీరు ఇక్కడ తెలంగాణకు వచ్చి పాలిస్తనంటే ఇక్కడి ప్రజలు అమాయకులా, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఉన్న మీరు అక్కడే రాజన్న రాజ్యం తెవొచ్చు కదా? అని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. కొందరు నోరు తెరిస్తే వచ్చేది సోనియమ్మ రాజ్యం అని, 70 ఏళ్లు పాలించింది కాంగ్రెస్సే కదా, అప్పుడు లేని అభివృద్ధిని ఇప్పుడు ఎలా తేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. మాయ మాటలతో మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని, కానీ జరిగేదంతా ప్రజలు గమనిస్తున్నారని హితవు పలికారు.


మైకు దొరికినప్పుడల్లా బండి సంజయ్ గోల్కొండ కోటమీద జెండా ఎగురవేస్తా అని అంటారు, కానీ గోల్కొండ కోట మీద జెండా జాతీయ జెండా ఎగురెస్తరు కదా?.. మరి ముఖ్యమంత్రి అయితే, ప్రగతి భవన్ పై మువ్వన్నెల జాతీయ జెండా ఎగరేస్తాం. బీజేపీ వారి మాటలు దేనికి సంకేతం. తీన్మార్ మల్లన్న వస్తె.. కచ్చితంగా జెండా జాతీయ జెండా ఎగురతది. పొలిటికల్ పవర్ కావాలంటే ఉద్యమించి కొట్లాడాలన్నారు. ఇదే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిండని, 7200 సైన్యం రాజ్యాంగ బద్ధంగా పనిచేస్తదన్నారు. సీఎం కేసీఆర్ ఒక జీతగాడని, ఆయన పనిచేయకపోతే అయనని దించి ఇంకొకన్ని పెట్టుకుంటాం అని తెలిపారు. ఓ ఐదేళ్ల తర్వాత వచ్చేది వేరే సర్కారే. కేసీఆర్ తెలంగాణ పునర్ నిర్మాణం అన్నాడు. అదే పలకరాకపోవడంతో బంగారు తెలంగాణ అంటుండని కానీ, కేసీఆర్ హమీలు నెరవేర్చలేదు?, ఏతులు మాట్లాడినందుకు బాతాల పోశెట్టి అంటున్నాం.. బరా బర్ అంట. బాతాల పోశెట్టి అంటేనే గుర్తుపడతరు. కేటీఆర్ ను డ్రామారావు, కవితని తైతక్క, సంతోష్ ను హ్యాపీ రావు అని పేర్లు పెట్టినట్లు మల్లన్న తెలపారు. ఈ కుటుంబాన్ని ఇలా పిలిస్తేనే అందరు గుర్తుపడతారన్నారు. మన దగ్గర దండం పెడితే, కేరళలో బయోడేటతో పోస్టర్లు వెలిశాయి. అవినీతికి ఆస్కారం లేకుండా పాలన కోసం మేము అడుగులు వేస్తూన్నాం.. అందుకే ఆగస్ట్ 29న జోగులాంబ గద్వాల జిల్లా నుంచి పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తమన్నారు. విద్య, వైద్యంపైనే మా దృష్టి ఉంటుందన్నారు. మేము ఎవరం కూడా ప్రజా ప్రతినిధులుగా వచ్చినా ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి. చదివిస్తం. ప్రతి ప్రతినిధి కూడా ప్రజల కోసమే పనిచేయాలని, తీన్మార్ మల్లన్న కూడా అలానే పని చేస్తారు చేయిస్తాడు. పాదయాత్రలో భాగంగా ప్రతి మండలంలో బహిరంగ సభ పెడతా, మా టీమ్ లో ప్రతి కార్యకర్త, ప్రతి సభ్యుడు కూడా ప్రజలు, వారి సేవల కోసమే పనిచేస్తారన్నారు. గండ్ర సత్యనారాయణ అనే వ్యక్తి మల్లన్న ఎంతో గొప్ప సహాయం చేసిండని తన గద్గర స్వరంతో చెప్పారు. తీన్మార్ మల్లన్న సహాయం వెనుక మీరిచ్చిన పది పది రూపాలయాలు, ఐదు రూపాయలు ఉన్నాయన్నారు. అలా ఎంతో మందిని ఆదుకున్నాం, రాబోవు రోజుల్లో ఇంకా ఇంకా చేస్తామన్నారు. అందుకు ప్రతి ఒక్కరీ సాయం, మద్దతు కావాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లులు కావాలి, కేసీఆర్ (బాతాల పోశేట్టి) బంధువు మై హోం రామేశ్వర రావు సంపదతో హై టెక్ సిటిలో అందరికీ ఇళ్ళులు కట్టించొచ్చు అని అన్నారు. మేము వస్తె కచ్చితంగా కట్టిస్తాం అన్నారు. 1600 కీ. మీ. వరల్డ్ రికార్డ్స్ సృష్టించిన రామకృష్ణ అనే ఓ వ్యక్తి.. తీన్మార్ మల్లన్న లక్ష్యం కోసం 1500 కీ.మీ మారథాన్ చేయునున్నట్లు తెలిపారు. ఆర్కే ఆర్మీ పేరుతో, ఎస్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో మారథాన్ ప్రారబించనున్నారన్నారు. మన పాదయాత్రలను భూమయ్య సార్ చూస్తారు. చివరికి సికింద్రాబాద్ లో పరేడ్ గ్రౌండ్లో సభ ఉంటదని, ఆరోజు ప్రజలతో పరేడ్ గ్రౌండ్ నింపుతానని ఆయన వెల్లడించారు. అంగూటి (మంత్రి మల్లారెడ్డి) అరాచకాలు, అవినీతి, ఆగడాలు ఎక్కువైనయ్.. మా సభకు మెదట అనుమతి ఇవ్వొద్దన్నాడు, ఇప్పుడు మళ్లీ ఇచ్చెయ్ రా బాబు అని బ్రతిమిలాడుకునే పరిస్థితి తెచ్చినం అని అన్నారు. అనంతరం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను మల్లన్న ప్రకటించగా.. నియోజక వర్గ, మండల కమిటీలను రాష్ట్ర కమిటీ కన్వీనర్ దాసరి భూమయ్య ప్రకటించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మలన్న అభిమానులు, సామాజిక కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.