భారీస్థాయిలో భారీకేడ్లతో ప్రగతిభవన్
హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): భారీస్థాయిలో భారీకేడ్లతో ప్రగతిభవన్ కు సోలార్ ఫెన్సింగ్ తో పహారా కాయనున్నారు. సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్ చుట్టూ ఇనుప కంచెతో ఇప్పుడు బారికేడ్ల ప్రాంగణంగా మారుతున్నది. ఇంతకాలం భవన్ చుట్టూ మాత్రమే ఎత్తయిన బారికేడ్లు, వాటిమీద సోలార్ ఫెన్సింగ్ ఉండేది. భద్రతా కారణాల రీత్యా నిత్యం వందలాది మంది పోలీసుల పహరా ఉండేది. కానీ ఇప్పుడు ఆ భద్రత మరింతగా పెరిగింది. రోడ్డుమీద డివైడర్ కూడా ఇప్పుడు భారీ ఫెన్సింగ్‌లాగా మారింది. సుమారు 350 మీటర్ల పొడవునా ఆరడుగుల ఎత్తులో భారీ స్థాయి బారికేడ్లతో ఫెన్సింగ్ వాల్ తయారవుతోంది. ప్రగతి భవన్ ముందు నిరసనలు, ధర్నాలను నివారించేందుకు పోలీసులు ఈ తరహా చర్యలకు శ్రీకారం చుట్టారు. సామాన్యులెవరూ ప్రగతి భవన్‌లోకి ఎంట్రీ కాని రీతిలో పోలీసుల ఆంక్షల వలయం తయారవుతున్నది.
