మమ్మల్ని రాళ్లతో కొడితే.. నిన్ను చెప్పులతో కొట్టాలి
- నోరుంది కదా అని ఏదైనా మాట్లాడితే సహించం
- మావి సేవా రాజకీయాలు.. రేవంత్ వి స్వార్థ రాజకీయాలు
- టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరినపుడు రాజీనామా ఎందుకు చేయలేదు?
- స్పీకర్ కు రాజకీయ లేఖ ఎందుకు ఇవ్వలేదు?
హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇచ్చారు. నోరుంది కదా అని ఏదైనా మాట్లాడితే సహించమని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హెచ్చరించారు. మీరు రాళ్లతో కొడితే మేం చెప్పులతో కొడతామని రేవంత్ ను హెచ్చరించారు. తాము రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం టీఆర్ఎస్‌లో వీలినం చేశామని అన్నారు. తమవి సేవా రాజకీయాలని, రేవంత్ వి స్వార్థ రాజకీయాలని అన్నారు. మాణిక్కం ఠాగూర్‌కి రూ. 25 కోట్లు ఇచ్చి రేవంత్ పీసీసీ తెచ్చుకున్నారని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా శనివారం నాడు టిఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డితో కలిసి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ…రేవంత్ రెడ్డి పార్టీలో మారిన వారిని రాళ్లతో కొట్టి చంపండన్నారని తమదైన శైలీలో మండిపడ్డారు. పీసీసీ రాకతో రేవంత్ రెడ్డి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారా? అని వారు నిలదీశారు. బ్లాక్ మెయిలింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ అన్నారు.
తాము రాజ్యాంగం పదో షెడ్యూల్ ప్రకారమే కాంగ్రెస్ నుంచి టీర్ఎస్ఎల్ఫీలో విలీనమయ్యాం అని చెప్పారు. రేవంత్ టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరినపుడు రాజీనామా ఎందుకు చేయలేదు. స్పీకర్ కు ఎందుకు లేఖ ఇవ్వలేదు అని నిలదీశారు. ఓటుకు నోటుకు దొంగ నుంచి నీతి పలుకులా ? అని కౌంటర్ ఏటాక్ చేశారు. దొంగ రాజకీయాలు రేవంత్ వి ..మావి సేవా రాజకీయాలు అన్నారు. ఇంట్లో రెవెన్యూ మాజీ ఉద్యోగులను పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడే ముఠా ను రేవంత్ నడుపుతున్నాడన్నారు. రాజస్థాన్ లో బీఎస్పి ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్ ను కూడా రాళ్లతో కొడుతావా? అంటూ రేవంత్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ కు వందేళ్ల కు పైగా చరిత్ర ఉంది. ఈ కాలంలో ఎన్నో పార్టీలు కాంగ్రెస్ లో విలీనమయ్యాయని, ఎవర్ని రాళ్ళతో కొడుతావ్ రేవంత్ అని నిలదీశారు. మాణిక్యం ఠాకూర్ కు 25 కోట్ల రూపాయలు ఇచ్చి పీసీసీ పదవి కొనుకున్నవాడు రేవంత్ అంటూ ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్లు కుత కుత ఉడికి పోతున్నారు. ఇదే భాషను రేవంత్ వాడితే చెప్పు దెబ్బలు తినడం ఖాయం అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పోయిన దొంగ రేవంత్ అన్నారు. సంచలనాల కోసం రేవంత్ ఎ గడ్డయినా కరుస్తారని వంగ్యస్త్రాలు సందించారు. ముప్పయ్ ఏళ్లకు పైగా నేను కాంగ్రెస్ లో ఉన్నా కాంగ్రెస్ రాజకీయాలు తెలుసు అన్నారు. 2018లో నా టికెట్ కూడా అమ్ముకోవడానికి రేవంత్ ప్రయత్నించాడు. చవక బారు రాజకీయాలు చేస్తే ఖబడ్ధార్ రేవంత్ రెడ్డి అన్నారు. 2014లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను దిగ్విజయ్ కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఆయన్ను కూడా రాళ్లతో కొడతావా? …గోవాలో కూడా బీజేపీలో ఓక పార్టీ విలీనమయ్యిందన్నారు. తాము రాజ్యాంగ సూత్రాల ప్రకారమే టిఆర్ఎస్ లో చేరామన్నారు. ఇక కెసిఆర్ నుంచి అధికారం గుంజుకునుడే అంటున్నాడన్నారు. నువ్వు గుంజుకుంటే అధికారం రాదు ..ప్రజలు ఇవ్వాలన్నారు. రేవంత్ ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేసి ఎందర్నో వేధిస్తున్నాడని దుయ్యబట్టారు. రేవంత్ ది దందా రాజకీయం అంటూ కడిగిపారేశారు.
రేవంత్ వాఖ్యల్ని ఖండిస్తున్నాం: ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి …

రేవంత్ వాడిన భాషకు ఆయన్ను చట్ట ప్రకారం రాజకీయాల నుంచి నిషేధించొచ్చని అని అన్నారు. రేవంత్ కాంగ్రెస్ లో ఉన్నందుకు ఆ పార్టీ ని కూడా నిషేధించాలా ?. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరినపుడు ఎమ్మెల్యే పదవికి రేవంత్ ఎందుకు రాజీనామా చేయలేదు?. షార్ట్ కట్ రాజకీయాలను నమ్ముకున్న వ్యక్తి రేవంత్. తాము కూడా రేవంత్ లాగా మాట్లాడగలం అన్నారు. సంస్కారం అడ్డువస్తుందన్నారు. లైన్ క్రాస్ అయితే రాజకీయ నాయకుడు ఎవ్వరూ రాణించలేరు? తాము రాజ్యాంగ బద్దంగా టీఆర్ఎస్ లో పదో షెడ్యూల్ ప్రకారం చేరామన్నారు. రాజ్యాంగం గురించి రేవంత్ తెలుసుకోవాలి అని అన్నారు. రేవంత్ తన గురువు చంద్రబాబు నుంచి ఈ విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఆరు నెలలకే రేవంత్ మరో పార్టీ మారినా మారొచ్చు. అపుడు ఎవరిని రాళ్లతో కొట్టాలి? …రేవంత్ భాష మార్చుకోవాలి? రేవంత్ పై ఎవరైనా కేసు పెట్టొచ్చు ..ఆయన శిక్షార్హుడు అన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం చాలా పార్టీల్లో విలీనాలు జరిగాయి. అన్నీ తెలుసుకునే రేవంత్ మాట్లాడితే మంచిది. తొందర పడి మాట్లాడితే రేవంత్ బొక్కా బోర్లా పడటం ఖాయం అన్నారు. రేవంత్ పరుష పదజాలాన్ని ఖండిస్తున్నాం అన్నారు. వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన పనులకు రేవంత్ రాళ్లు విసురుతాడా? అని అన్నారు.
రేవంత్.. మీ చిల్లర రాజకీయాలు మానుకో?? : ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి..

రాళ్లతో కొట్టాల్సి వస్తే మొదట ఇన్ని పార్టీలు మారిన రేవంత్నే కొట్టాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. హోదా పెరిగితే హుందా తనం పెరగాలి ..కానీ రేవంత్ దిగజారి మాట్లాడుతున్నారు. దిగజారి మాట్లాడితే రేవంత్ కు ప్రజలే గుణపాఠం చెబుతారు. రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేసి యువతను పెడ దోవ పట్టించొద్దు. ప్రజల కోసమే మేము రాజ్యాంగ బద్దంగా పార్టీ మారాం. రేవంత్ నీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
