మోడీ టీమ్.. మహిళా శక్తి
కేంద్ర మంత్రివర్గంలో మహిళలకు పెద్దపీట
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
న్యూఢిల్లీ, హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి) : ప్రధాని నరేంద్ర మోడీ కొత్త టీంలో మొత్తం15 మంది కేబినెట్ మినిస్టర్లుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా మోడీ 43 మందికి చోటు కల్పించారు. వీరంతా రాష్ట్రపతి భవన్లో మంత్రులుగా ప్రమాణం చేశారు. యువత, ప్రాంతాలు, సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకుని మోడీ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. తాజా విస్తరణతో కేంద్ర క్యాబినెట్‌లో మంత్రుల సంఖ్య 77కు పెరిగింది. కాగా.. ఈ విస్తరణలో మంత్రివర్గంలో మహిళా శక్తి పెరిగింది. ఏడుగురు మహిళలకు కొత్తగా మంత్రి పదవులు లభించాయి. కోవిడ్ ప్రోటోకాల్ మధ్య రాష్ట్రపతి భవన్ లో బుధవారం సాయంత్రం ప్రమాణస్వీకారం జరగగా.. ఇప్పుడు క్యాబినెట్ మహిళా మంత్రుల సంఖ్య 9కి చేరింది.
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ఇలా..
ఇప్పటికే మోడీ క్యాబినెట్ లో నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ ఇద్దరు మహిళా సీనియర్ మంత్రులు ఉన్నారు. వీరితో పాటు మోడీ టీంలో కొత్తగా ఎడుగురు మహిళలకు సహాయ మంత్రులుగా చోటు కల్పించారు. దీంతో మోడీ కాబినేట్ లో మహిళల సంఖ్య తొమ్మిదికి చేరింది.
మీనాక్షి లేఖి,
అనుప్రియా పటేల్
శోభా కరంద్లాజే,
ప్రతిమా భౌమిక్,
భారతీ పవార్,
అన్నపూర్ణా దేవి,
దర్శన విక్రమ్ జర్దోశ్
