రజాకార్లు, ఎంఐఎం రాకతో.. భాగ్యనగరం అగమాగం
హైదరాబాద్, టీఎస్ డ్రీమ్స్ : భాగ్యనగరం దేశంలోనే అత్యదిక హిందువులుండే ప్రాంతం.. అన్ని ప్రాంతాల హిందువులు నివసించే ప్రాంతం కూడా. ఎందరినో అక్కున చెర్చుకున్న ఈ భాగ్యనగరం.. నాడు పరిపూర్ణ హిందు మతానికి ప్రతీక.. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం అంటే తెలియని వారే ఉండరు. కానీ, దురదృష్టం ఎంటంటే.. పాతబస్తీ అంటే నేడు వేరే వేరే ఐకాన్ల పేర్లు చెబుతుంటారు. ఇది కొందరి ఆరాచక పాలనకు నిదర్శనం అని చెప్పకతప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. భరతమాత ముద్దు బిడ్డల్లారా….. భాగ్యనగర్ వాసుల్లారా అంటూ హైదరాబాద్ బీజేపీ పార్లమెంటు సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడారు.
ఒకప్పుడు పాతబస్తీలో హిందూవులు మెజారిటీగా ఉండే… మరాఠాలు, కన్నడిగులు, తెలుగోళ్లు, మర్వాడీలు, రాజస్తానీలు, గుజరాతీలతో పాతబస్తీ అంటే మినీ భారత్ గా ఉండేదని పేర్కోన్నారు. కానీ, ఎంఐఎం గూండాల అరాచకాలకు ప్రభుత్వాలు వంత పాడటంతో పాతబస్తీలో ఉన్న హిందూవులంతా మూసీ నది ఇవతలికి వలస వచ్చేసిండ్రు.
మనం కాశ్మీర పండిట్ల ఊచకోతకు గురైన విషయాన్ని ప్రజలంతా చెప్పుకుంటారన్నారు. వాళ్ల ఊచకోత తరువాత కాశ్మీర్ లోయ టెర్రరిస్టుల వశమైందన్నారు. ఆ మారణకాండను ఆదర్శంగా తీసుకుని పాతబస్తీలో క్రమక్రమంగా హిందూవులపై అరాచకాలు చేసి వెళ్లగొడుతుంటే రాష్ట్రాన్ని ఏలుతున్న ప్రభుత్వాలు ఈ ఎంఐఎం గూండాల సంక నాకుతున్నయని ద్వజమెత్తారు. ఒక్క మైనారిటీపై చిన్న దాడి జరిగినా, కుహానా సెక్యూలర్ వాదులంతా గాయి గాయి చేస్తరని హితవు పలికారు. లక్షల మందిని వెళ్లగొడుతుంటే.. ఒక్కరు కూడా మాట్లాడలేదని, ఇవి ఇంకా ఎన్నాళ్లూ చూస్తూ భరిద్దాం అని నిలదీశారు. కర్నాటకలో ఒక ముస్లిం అమ్మాయిని మిగితా స్టూడెంట్ ‘స్కూల్ యూనిఫాం’ ఫాలో కావాల్సిందే అని డిమాండ్ చేస్తే.. వేల మంది మధ్యలోనుంచి ఆమె నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోయిందన్నారు. ఆమెను ఎవరూ ఒక్క మాట అనలేదు?.. డిస్ట్రబ్ చేయలేదు?.. కానీ, దీన్ని కొందరు తమ అవకాశవాద రాజకీయాలతో గాయిగాయి చేసి పోటీలుపడి సంఘీభావాలు చెప్పిండ్రని దుయ్యబట్టారు. రేచ్చగొట్టే వారికి సలాం కొట్టిండ్రని, ఆమె స్వేచ్ఛను ఎవరూ హరించొద్దని గోల చేసిండ్రని, ఇలాంటి రాజకాయాలు తగవన్నారు. ఎక్కడో పోరుగు రాష్ట్రంలో సంబందంలేని విషయాల్లో రేచ్చగొడితే తెలంగాణలో.. ఓ అన్నా, చెల్లే, ఇతర టీఆర్ఎ నేతలంతా కలిసి గాయి గాయి చేసిండ్రని తనదైన శైలీలో కడిగి పారేశారు. కర్ణాటకలో అందరూ స్కూల్ యూనిఫాం వేసుకోవాలని పోస్ట్ పెట్టిన పాపానికి అమాయకుడైనా యువకుడు తమ్ముడు హర్షను కత్తులతో అతి దారుణంగా పొడిచి చంపితే… వీళ్లంతా ఏమైండ్రని ప్రశ్నించారు. వీళ్ల నోళ్లు పడిపోయయా?… వీళ్ల ట్వీట్టర్ అకౌంట్ లు సచ్చిపోయినాయా? స్పందించని వీళ్లంతా హిందూ ద్రోహులు? కదా? అని నిలదీశారు. కానీ, ఈ లుచ్చా నాయకులు ఒకటి మర్చిపోతున్నరు. ఇది నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా శకం అని గుర్తుంచుకోవాలన్నారు. క్యారే అంటే.. క్యాబే అంటం.. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేతే… వాడు కట్టెపడితే… ఇవతల తల్వార్ పడతం అన్నారు. పాతబస్తీలోని భవానీ నగర్, కాలాపత్తర్, పత్తర్ గట్టీ, తలాబ్ కట్ట, గౌలీపూర, శాలిబండలో మెజారిటీగా ఉండే ప్రాంతాల్లో ఉండే హిందువులు యాడ పోయిండ్రని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మా హిందువులంతా తరలిపోతుంటే ఎందుకు కాపాడలేదని.. వేదిక బండి సంజయ్ నిలదీశారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి దగ్గర కాషాయం జెండా పెట్టి వేల మందితో మీటింగ్ పెట్టామన్నారు. ఇగ పాతబస్తీలో…. కాషాయ జెండా ఎగరేయడమే మిగిలిందన్నారు. ఎంఐఎం కోటలు బద్దలు కొట్టబోతున్నం అని జోస్యం చెప్పారు. ఈ టీఆర్ఎస్ సర్కార్ … ఆ రజాకార్లను ఎన్ని రోజులు నెత్తిమీద పెట్టుకుని ఊరేగుతదో చూస్తం అంటూ కేసీఆర్ సర్కార్ ను హెచ్చరించారు. ఆ రజాకార్ పని… వాడ్ని మోసేటోడి పని త్వరలోనే ఖతం కాబోతోందన్నారు. మాకు పక్కా నమ్మకం ఉంది? మీకుందా లేదా? బోలో…భారత్ మాతాకీ జై అంటూ నినాదం చేస్తూ వారిలో స్పూర్తీ నింపారు.
10 శాతం ఓటు బ్యాంకు ఆసరా చేసుకుని వాళ్లు రాజకీయాలు చేస్తున్నా, అరాచకాలు చేస్తున్నా ఇన్నాళ్లూ వాళ్ల హవా నడిచింది. ఇప్పుడు వాళ్ల పునాదులు కూల్చాల్సిన సమయం వచ్చింది. నేనడుగుతున్నా… పాతబస్తీ ఎంఐఎం గూండాలకు రాసిచ్చారా? అదేమైనా రజాకార్ల సొత్తా? మెజారిటీ హిందువులున్న చోట్ల మనం ఎందుకు గెలవడం లేదు?
మలక్ పేట, కార్వాన్ నియోజకవర్గాల్లో మన హిందువుల ఓట్లు 55 శాతానికిపైగా ఉన్నయ్. ఆనాడు కార్వాన్ లో బద్దం బాల్ రెడ్డి కాషాయ జెండా ఎగరేయలేదా? గోషామహల్ లో మన కింగ్ రాజాసింగ్ రెండు సార్లు గెలిచి మన సత్తా చూపడం లేదా? హైదరాబాద్ పార్లమెంట్ ఒవైసీ అబ్బ జాగీరా? … మలక్ పేట, కార్వాన్, గోషామహల్, చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గాల్లో హిందూవులంతా ఏకమైతే హైదరాబాద్ పార్లమెంట్ లో కాషాయ జెండా ఎగరేయడం ఖాయం. నాకు ఎదురేలేదని విర్రవీగుతున్న ఎంఐఎం మెడలు వంచడం ఖాయమని, కషాయ జెండా ఎగరేయాలనుకున్న గొల్లకొండ కోట కార్వాన్ నియోజకవర్గంలోనే ఉందని, ఈసారి బీజేపీని గెలిపించి కమలం పార్టీ సత్తా చాటుదాం అని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి రావాలని తపించిన బద్దం బాల్ రెడ్డి, టైగర్ నరేంద్ర ఆశయాలను సాధించి తీరుదాం అన్నారు.

గతంలో ఎన్నో పదవులు ముస్లీంలకే ఇచ్చారని, ఇక్కడి వారంతా మేల్కనకపోతే రాష్ట్రం ఎంఐఎం గుప్పిట్లోకి వెళ్లిపోతే, మళ్లీ రజాకార్ల పాలన వస్తుందని చెప్పారు. తెలంగాణలో కుట్ర పన్నిన ఎంఐఎం హిందువుల ఓట్లను తీసేస్తోందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.
గణేష్ నిమజ్జనం నాడు పాతబస్తీ నుండి ఏనాడైనా ఎంఐఎం స్వాగతం పలికిందా? అని నిలదీశారు. ఈ సోయిలేక.. రంజాన్, బక్రీద్ పండుగలకు వెళ్లి ఫ్లెక్సీలు కట్లి ఇఫ్తార్ దావత్ ఇస్తున్నారని గుర్తుచేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తే అధికారికంగా గణేష్ నిమజ్జనం ఉత్సవాలు నిర్వహిస్తాం అన్నారు. అయోధ్య తరహాలో చరిత్రలో నిలిచిపోయేలా భాగ్యనగర్ లో భాగ్యలక్ష్మీ ఆలయాన్ని నిర్మిస్తాం అన్నారు. ఇక్కడి నుంచి తరలివెళ్లిన వాళ్లందరినీ పాతబస్తీకి ఘర్ వాపసీతో రప్పించి వాళ్లు కోల్పోయిన ఆస్తుల్ని, తిరిగి ఇప్పించే ప్రయత్నంచేస్తాం అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎంఐఎం చంకన చేరుతుంది. హిందూ ఓట్లను తొలగిస్తుంది. దొంగ ఓట్లను ఎక్కిస్తారు. ఒక్కో ఇంట్లో వందల ఓట్లు ఉంటయ్. ఏదో రాష్ట్రం నుండి తీసుకొచ్చి ఓట్లేయిస్తరు. మైనర్ పిల్లలతో కూడా ఓట్లు వేయించుకుంటారని హితవు పలికారు. ఈ ఎంఐఎం కుట్రలను చేధిద్దాం. మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఓట్లు పోకుండా చూడాలి. పాలన చేతగాని ఓ పోటుగాడు.. దేశ రాజకీయాలను శాసిస్తానని ప్రగల్భాలు పలికిండని ఏద్దేవా చేశారు. ఈ ఫ్రంట్లు, టెంట్లు బీజేపీని ఏమీ చేయలేవన్నారు. మోడీ నాయకత్వంలో గతంలో 303 సీట్లు గెలిచామని.. ఈ సారి 306 కు పైగా సీట్లతో బ్రహ్మండమైన మెజారిటీతో గెలవబోతున్నం అన్నారు.
తాము ఏనాడు కూడా పాతబస్తీలోని ముస్లింలకు వ్యతిరేకం కాదని… ఎంఐఎం గూండాలు వాళ్ల కబ్జాలు, అరాచకాలకు మాత్రమే వ్యతిరేకం అన్నారు. ఓల్డ్ సిటీలో మెట్రో వేస్తే హైటెక్ సిటీకీ అనుసంధానం ఏర్పడితే, ఒవైసీ, ఆయన బంధువుల ఆస్తులు పోతాయనే పాతబస్తీలో మెట్రోను, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చురకలు అంటించారు. ఇలాంటి గూండాలను తరిమి తరిమి కొడదాం అన్నారు.
క్రికెట్ లో ఇండియా గెలిస్తే నల్ల జెండాలతో నిరసన తెలిపే లుచ్చా కొడుకులు మనకు అవసరమా? పాకిస్తాన్ గెలిస్తే టపాసులు కాల్చుకుని సంబురాలు చేసుకునే కుత్తేగాళ్లు మనకు అవసరమా? ఇలాంటి వాళ్లను బట్టలూడదీసి తెలంగాణ పొలిమేర దాకా తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
తొలి తెలంగాణ, మలి తెలంగాణ ఉద్యమంలో రజాకార్ పార్టీ తెలంగాణ ద్రోహ పార్టీయని, ఎంఐఎం గూండాలు, ఒవైసీ రజాకర్ల భావ జాలాన్ని దేశవ్యాప్తంగా చేసి, హిందువులను విచ్చన్నం చేసి దేశాన్ని ఏలాలని చూస్తుండని ఆరోపించారు. వీరి ఆగడాల్ని ఆపాలంటే హైదరాబాద్ లో బీజేపీ సత్తా చాటితే ఒవైసీ కోటను కూకటి వేళ్లతో పెకిలించవచ్చని సూచించారు. భారీ మెజార్టీతో బీజేపీని గెలిపిస్తే… రజాకార్ పార్టీ, ఎంఐఎం, వాళ్లకు వత్తాసు పలుకుతున్న టీఆర్ఎస్ ను బంగాళా ఖాతంలో తొక్కవచ్చని బండి సంజయ్ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

