రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 30 మందికి గాయాలు.. తప్పిన ప్రాణప్రాయం

హైదరాబాద్/నిర్మల్ : నిర్మల్ జిల్లాలోని భైంసా మండలం తిమ్మాపూర్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బైంసా నుంచి నిర్మల్ వెళ్తున్న బస్సును అదే మార్గంలో గొల్లమడ వెళ్తున్న మరో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా 20 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. రెండు బస్సులలో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నారు. 108 వాహనం ద్వారా క్షతగాత్రులను బైంసా ఆస్పత్రికి తరలించారు. రెండు బస్సుల్లో సుమారు 80 మంది వరకు ఉండొచ్చని సమాచారం. ఘటనా స్థలిని భైంసా ఏఎస్పీ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

