రేపు రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి
- తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి
- ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క..
- సీఎంను ఖరారు చేసిన హై కమాండ్
- రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న రాహుల్ గాంధీ
హైదరాబాద్, టీఎస్ డ్రీమ్స్, డిసెంబర్ 3 :- తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో ఘన విజయం సాధించింది. భారీ విజయం సాధించిన ఎనుముల రేవంత్ రెడ్డిని.. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ముఖ్యమంత్రిగా ప్రకటించింది. తెలంగాణలో తమ పార్టీ దుందుభి మోగించడంతో కష్టపడ్డ పార్టీ విజయానికి కృషిచేసిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్కలతో రేపు ప్రమాణ గవర్నర్ తమిళసై స్వీకారం చేయించనున్నారు. అయితే రేవంతు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు.

