రేవంత్ ప్రమాణస్వీకారం అదుర్స్..కేసీఆర్ ఓ మారీచుడు
మనకు పీకేలు,గీకేలు అవసరం లేదు?
మా కార్యకర్తలే పీకేలు.. ఏకే 47లు
సోనియా రుణం తీర్చుకోవాలంటే 2023లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాల్సిందే
హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): తెలంగాణకు నూతనంగా ఎన్నికైన అనముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం భారీ ర్యాలీతో ప్రారంభమై గాంధీ భవన్ లో కార్యకర్తలు నాయకుల సమక్షంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతన పీసీసీ అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 60 ఏళ్ల కలను 4కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు సోనియగాంధీ మనకు తెలంగాణను ఇచ్చారు అన్నారు. తెలంగాణ తల్లి సోనియమ్మ అని అన్నారు. తెలంగాణ ప్రజలు ఇంట్లో సోనియా గాంధీ ఫోటువను మొక్కాలని అన్నారు. దేశాన్ని, తెలంగాణను పట్టిపీడుస్తుంది కరోనా కాదు కేసీఆర్, మోదీ అన్నారు. ప్రతి ఒక్క పౌరుడు తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరడానికి మొక్కవోని దీక్షతో పనిచేయాలన్నారు. కేసీఆర్ వచ్చిన తరువాత రైతుల ఆత్మహత్యలు ఆగలేదని, ఎన్ కౌంటర్ లు ఆగలే, పేదరికం పోలేదని మరీ తెలంగాణను ఎందుకు తెచ్చుకున్నాము అన్నారు. తెలంగాణ మరీచుడు ఈ కేసీఆర్ అని, తెలంగాణను చెరబట్టి ఫామ్ హౌస్ లో బంధించిన మారీచుడు ఒక రావణాసురుడు కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ ను ఓడగొట్టెందుకు పీకే సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారని వారికి ధన్యవాదాలు చెప్పారు. మనకు పీకేలు అవసరం లేదని మన కార్యకర్తలే పీకేలని, ఏకే 47లని అన్నారు. సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే 2023లో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని సభాముఖంగా తెలిపారు.
