వనం వదిలి జనంలోకి రండి..మావోయిస్టులకు ఎస్పీ పిలుపు
ఆదిలాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని డ్రెడ్రా గ్రామంలో కరోనా బారిన పడ్డ మావోయిస్టులు వనం వదిలి జనంలోకి రావాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. బజార్ హత్నూర్ మండలంలోని డెడ్రా గ్రామానికి చెందిన మహిళా మావోయిస్ట్ సుమన్ బాయి అలియాస్ సంగీతక్క కుటుంబాన్ని ఎస్పీ కలిశారు. సుమన్ బాయి తల్లి అంజనాబాయిని కలిసిన ఎస్పీ సుమన్ బాయిని లొంగిపోవాలని కోరాడు. అడవిలో చాల మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, లోంగిపోతే తనపై ఉన్న రివార్డుతో పాటు లొంగిపోయిన మావోయిస్టులకిచ్చే సంక్షేమ పథకాలను అందిస్తామని ఎస్పీ హామి ఇచ్చారు. ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఇటీవలే మావోయిస్టు హరిభూషణ్ తోపాటు మరికొందరు మావోయిస్టులు కరోనా సోకి మృతి చెందారన్నారు. లొంగిపోతే మెరుగైన వైద్యం అందించి కాపాడుకుంటామని ఎస్పీ అన్నారు. సుమన్ బాయి, సుమన్ బాయి వదిన ఎక్కడ ఉన్న లొంగిపోవాలని మీడియా ముందు అంజనాబాయి వేడుకుంది. వృద్ధాప్యంలో నీ అవసరం ఉందని.. మీ కోసం మీ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, గ్రామస్థులు వేచి చూస్తున్నట్లు అంజనాబాయి తెలిపింది.
