సర్వర్ .. (ప)రేషన్
- బియ్య రాక లబ్ధిదారులకు తీవ్ర ఇక్కట్లు
- నరకం చూపిస్తున్న సర్వర్లు..
- సర్కార్ బియ్యం కోసం నిరుపేదల పడిగాపులు
- పేదరికం లేని దేశం సాద్యమేనా? అంటున్న మెధావులు
- పెదరికాన్ని లేకుండా చెస్తామంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా
- కొత్త కార్డుల కొసం పడిగాపులు..
- పేద ప్రజలపై పాలక సర్కార్ వివక్ష

హైదారాబాద్, టీఎస్ డ్రీమ్స్ : చాలి చాలని జీతాలు.. దినసరి కూలీల వేతనాలు ఇలా పూట గడవని కుటుంబాలెన్నో ఉన్నాయి. రేక్కాడితే కానీ, డొక్కాడని దిగువ మధ్యతరగతి నిరుపేద ప్రజలకు సైతం అవస్థలు తప్పడంలేదు. 24 గంటలు పనిచేసిన కానీ, రెండు పూటల తిండి తినలేని దయనీయ పరిస్థితి వారిది. వీరందరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే రేషన్ బియ్యమే వారికి మహ పరమన్నంలాంటిది మరి. కానీ, గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ చెప్తున్నట్లుగా గానీ, పేద, మద్య తరగతి ప్రజలు అశించిన స్థాయిలో రేషన్ బియ్యం రాకపోవడంతో ప్రతి నెల కూడా తామంతా తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నామని వేలాది మంది రేషన్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పాస్ యంత్రాలకు నిత్యం సర్వర్ డౌన్ ఓకారణం కాగా, కొందరివి వెలి ముద్రలు సైతం పనిచేయకపోవడమే అటు పాలక సర్కార్ కు, ఇటు రేషన్ డీలర్లకు వరంగా మారింది. ఇది పేద, మద్య తరగతి ప్రజలకు ఓ శాపంగా మారిందని డొక్కలు మాడ్చుకుంటున్న ప్రజలు చెప్తున్న మాట. గతంలో మాదిరిగా బహిరంగ మార్కేట్ లో రేషన్ బియ్యాన్ని కొంత మేర తప్పా? మొత్తంగా నల్ల బజారులో పూర్తీ స్థాయిలో అమ్ముకునే పరిస్థితి లేదు. దీంతో ఇదే విషయాన్ని సైతం డీలర్లు.. సర్వర్ పూర్తీ స్థాయిలో లేకా రోజుకు 10 మందికి కూడా రేషన్ ఇవ్వడం లేదని, తండ్లాడుతూ నెట్టుకొస్తూ తప్పనిసరి పరిస్థితుల్లో బియ్యం ఇస్తున్నామని రేషన్ డీలర్లు చెబుతున్నారు.

గతంలో తీసుకుందామంటే దొరకని సరుకులు, నేడు కొటా పూర్తిగాక, సరుకులు ఇవ్వక, అశించిన స్థాయిలో కమిషన్ రాక అద్దేలు కట్టలేని పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయని డీలర్లు చెప్తున్నారు. ప్రతినెల కోటా, మరో పక్క రేషన్ గడువు దగ్గర పడుతుండడం, కొన్ని షాపుల్లో తెచ్చిన స్టాక్ నిల్వలు అట్లానే పేరుకపోవడంతో తెల్ల రేషన్ కార్డు దారులు, డీలర్లు అందోళనలో ఉన్నట్లు చెప్తున్నారు. ప్రభుత్వాలు చెబుతున్నట్లుగా పేదరికాన్ని రూపుమాపుతాం కాదు?.. పేదరికం లేని సమాజ నిర్మాణం, ఆహర కోరత నిర్మూలన, ఆరోగ్య భారత్, ఆరోగ్య తెలంగాణ సాధనకు.. తెల్ల రేషన్ కార్డు దారులకు ప్రతినెల వారికి సరిపడ బియ్యం ఇస్తేనే రెండు పూటల తింటారు.. లేకపోతే మరో 20 ఏళ్లు గడచిన కూడా పేదరికం పొకపోగా.. తెల్ల రేషన్ కార్డులు శాశ్వతంగా ఉండే అవకాశం లేకపోలేదని మేధావులు, విశ్లేశకులు చెప్తున్నారు.
