14న యాదాద్రికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 14న సోమవారం యాదాద్రిలో పర్యటించనున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ కూడా సీజేఐతో పాటు యాదాద్రికి వెళ్లనున్నారు. సీజేఐ, గవర్నర్, సీఎం కలిసి యాదాద్రిలో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. నిన్న హైదరాబాద్ చేరుకున్న సీజేఐకి శంషాబాద్ విమానాశ్రయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. రాజ్‌భవన్‌లోని అతిథి గృహంలో బస చేసిన జస్టిస్ రమణ మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉంటారు. ఇక్కడే వివిధ కార్యక్రమాలు, సదస్సుల్లో ఆయన పాల్గొంటారు.
