31 పేరుతో మద్యం బాటిళ్లు వసూళ్లు
- వైన్స్ లు, బార్ల నుండి లిక్కర్ బాటిల్స్ సేక(రించిన)రిస్తున్న ఉప్పల్ ఎక్సైజ్ సిబ్బంది..
- పట్టించుకోని అధికారులు..?
- ఆఫీసియల్స్ కు, మీడియా వారికివ్వాలని కాటన్ల కొద్ది మద్యం బాటిల్స్ వసూల్

హైదరాబాద్, డిసెంబర్ 31): మద్యం తాగవద్దు.. మద్యపానం ఆరోగ్యానికి హానికరమని మద్యం తయారు చేసే బాటిల్స్ పైన నే ప్రింట్ తో ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే.. దూడను పాలు చీకమని.. బర్రెను తన్నమని చెబుతున్న ప్రభుత్వాలు.. మద్యం తాగి రోడ్డు మీద వాహనాలపై వెళ్తే 15వేల రూపాయలు ఫైన్ అంటున్న పోలీసులు.. ఈ తరుణంలో డిసెంబర్ 31 పేరుతో అఫీషియల్సుకు,అనఫిషియల్సుకు మీడియా వారికి మద్యం బాటిల్స్ ఒక్కొక్కరికి రెండు ఇవ్వాలని,ఖరీదు గల మద్యం బాటిల్లు,ఉప్పల్ ఎక్సైజ్ సిబ్బంది ఒక్కో వైన్స్,ఒక్కో బారు వద్ద కాటన్ బాటిల్స్ వసూలు చేసినట్లు తెలిసింది. కాగా, ఉప్పల్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 29 వైన్సులు 32 బార్లు ఉన్నాయి. ఉప్పల్ ఎక్సైజ్ సిబ్బంది వసూలు చేసిన మద్యం బాటిల్స్ ను సగం ఎక్సైజ్ సిబ్బంది నొక్కుతూ..మరో కొంతమందికి వారికి నచ్చిన వారికి ఇవ్వడం..ఈ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో పరిపాటిగా మారింది. అసలే వైన్సులకు,బార్లకు, పోటా పోటీ మీద అధిక లైసెన్సు ఫీజులు పెంచుకొని, వైన్సులు, బార్లలో గిరాకి లేదని మొత్తుకుంటూ, నెత్తి నోరు కొట్టుకుంటున్న మద్యం వ్యాపారుల వెంట ఎక్సైజ్ అధికారులు ఒకవైపు, పోలీసు అధికారులు మరోవైపు, పండుగలు,పబ్బాలు వస్తే చాలు తమను ఇబ్బందుల పాలుకు గురి చేస్తారని మద్యం వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 31 పేరుతో, మద్యం బాటిళ్లు కాటన్ల కొద్దిగా సేకరించడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అదే కాకుండా నెలమాముల్లు బరాబర్ గా వసూలు చేయడంతో, కొంతమంది మద్యం వ్యాపారులు తమ షాపులను మూసేసుకుందామని ధోరణిలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయం ఆ నోట ఈ నోట
పోక్కడంతో ఇదేమి పద్ధతని ఎక్సైజ్ సిబ్బందిని “మీడియా ప్రతినిధి” ప్రశ్నించడంతో మాకేం తెలవదని ఎక్సైజ్ పోలీసులు మాత్రం.. తాము అంతా మా ఉన్నతాధికారి ఆదేశాల మేరకే తాము నడు(పనిచే)స్తున్నామని వారు సమాధానం చెప్పారు. ఈ విషయమై ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ ను వివరణ కోరెందుకు ఫోన్ చేయడంతో అందుకు ఆయన సమాధానమివ్వలేదు. అనంతరం ఈ వార్త “వాట్సప్ లలో ప్రచారం” కావడంతో అందుకు స్పందించిన ఎక్సైస్ సీఐ చంద్రశేఖర్ ఫోన్ లో మాట్లాడుతూ… మా సిబ్బంది వైన్స్ లు, భార్ల వద్ద.. డిసెంబర్ 31, నూతన సంవత్సరం పేరుతో బాటిల్స్ కానీ, డబ్బులు కానీ, నెల మామూల్లు వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే, తాను ఉద్యోగం నుండీ తప్పుకుంటానని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు ఎక్సైజ్ పోలీస్ అధికారులు, సిబ్బంది వైన్స్,బార్ల అధికారులకు ఎన్ని మార్లు ఫోన్ చేశారో, ఫోన్ కాల్స్ డేటా తీ(చూ)సి, వారిపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తమ సిబ్బంది బాటిల్ తీసుకెళ్ళినట్టుగా తన దృష్టికి వస్తే.. వెంటనే వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా.. తాను సైతం ఉద్యోగానికి తన రాజీనామా చేస్తానని సంబంధిత (ఉప్పల్ ఎక్సైజ్ సీఐ) అధికారి చెప్పడం శోచనీయం. కిందిస్థాయి సిబ్బంది, అధికారులు తప్పు చేస్తే మందలించి.. తప్పు చేయకుండా చూడాల్సిన అధికారులే.. ఇలాంటి చర్యలకు పూనుకుని సవాల్ విసరడం, తాను తప్పు చేయలేదని తప్పించుకునే ప్రయత్నంలో.. ప్రశ్నించే ఎదుటివారిని బెదిరించే ప్రయత్నం చేయడం, సవాల్ విసిరితే భయపడతారనుకోవడం పట్ల సామాజిక కార్యకర్తల మేధావులు సైతం.. అధికారి వ్యవహరించిన తీరు సరైన పద్ధతి కాదని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు. సమాజంలో బాధ్యత గల అధికారులే ఇలా ప్రవర్తిస్తూ… సమాజం మారాలనుకోడం వారి మూర్ఖత్వానికి నిదర్శమని మేధావులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా సరే.. మా ప్రభుత్వంలో రూపాయి లంచం ఇవ్వద్దు.. ప్రజలకు ఇబ్బంది కావొద్దు అన్న కొత్తగా ఏర్పడ్డ రేవంత్ ప్రభుత్వం.. తప్పు చేసిన, చేస్తున్న అధికారుల పట్ల ఈ సూత్రం పాటిస్తుందా?? లేక ఇలాంటి అధికారులను చూసి చూడనట్లు గాలికే వదిలేస్తుందా?? చూడాలి మరి..
కొసమెరుపు..
కొంతమంది నెల,నెలా మామూల్లు, మందు బాటిళ్లు తెచ్చుకునే మీడియా మిత్రులు కొందరు,ఎక్సైజ్ సిబ్బందికి వత్తాసు పలుకుతూ.. సోషల్ మీడియాలో పెట్టిన “వార్తను కొంతమంది రిపోర్టర్లు డిలీట్ చేయడంతో మరింత వైరల్ గా మారింది. అక్రమ మార్గంలో ఏర్లైపాడుతున్న మద్యం వ్యాపారంపై ప్రశ్నించాల్సిన జర్నలిస్టులే ఇలా వార్తను డిలీట్ చేయడం పట్ల కొందరు సామాజిక కార్యకర్తలు, మేధావులు సైతం, అది వారి మనస్తత్వానికే నిదర్శనమని చెప్పవచ్చు అంటూ చురకలాంటించారు.
ఐదేళ్లయిన ఈ అధికారికి బదిలీ లేదా….?
ప్రభుత్వ నిబంధనల మేరకు ఒకే ప్రాంతంలో ఏ అధికారైన మూడు సంవత్సరాలు మాత్రమే ఉద్యోగ విధులు నిర్వహించాలి. కానీ, ఉప్పల్ ఎక్సైజ్ కార్యాలయంలో అధికారిగా పనిచేస్తున్న ఎక్సైజ్ సీఐ 5 సంవత్సరాలు కావస్తున్న.. ఇక్కడే, ఇదే ప్రాంతంలో ఉండడంతో ఈ విషయంలో అంతర్యం ఏమిటని ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా సంబంధిత ఎక్సైజ్ మంత్రి, ఉన్నతాధికారులు, ఎక్సైజ్ కమిషనర్, ఏఈఎస్, ఈఎస్ ఈ విషయంపై చొరవ తీసుకుని సంబంధిత అధికారిని బదిలీ చేయాలని ఆయా మద్యం వ్యాపారులు అధికారులను కోరుతున్నారు.
