Lockdown తెలంగాణలో లాక్‌డౌన్ – రూల్స్ ఇవే..
1 min readహైదరాబాద్ (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): తెలంగాణలో లాక్‌డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం (రేపటి) నుంచి పదిరోజుల పాటు ఈ లాక్‌డౌన్ కొనసాగనుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రం లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. నిత్యవసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ సమయంలో వెసులుబాటు కల్పించారు. ఉదయం 10 గంటల తర్వాత మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ అమలు కానుంది. ఈ సమయంలో దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నారు. అలాగే వ్యాక్సిన్ కొరత నివారించేందుకు టీకా కొనుగోలుకు గ్లోబర్ టెండర్లను పిలవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
The State cabinet has decided to impose lockdown in the State from 10 am on May 12 (Wednesday) for ten days. However, there would be relaxation for all the activities from 6 AM to 10 AM daily. The Cabinet also decided to invite Global tenders for the procurement of the vaccine.