December 1, 2025

Tsdreams

INDIAN NEWS NETWORK

క‌రోనా మెడిసిన్ వ‌చ్చేసింది – మ‌నం వాడొచ్చా?

1 min read

హైద‌రాబాద్ (టీఎస్ డ్రీమ్స్ ప్ర‌తినిధి):
ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న కరోనా మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్లే తప్ప మందులు ఇప్పటివరకూ లేవు. తాజాగా భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఓ మెడిసిన్‌ని తయారుచేసి విడుద‌ల చేసింది. దీన్ని కరోనా రోగులకు ఎమర్జెన్సీ వాడకానికి వాడవచ్చని, భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. తాజాగా ఈ మందును కేంద్ర రక్షణ, ఆరోగ్యశాఖ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, హర్షవర్ధన్‌ విడుదల చేశారు. కరోనా వైరస్ మీద పోరులో భారత్‌నే గాక మొత్తం ప్రపంచాన్ని ఈ డ్రగ్ కాపాడుతుందని ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రులు ధీమా వ్యక్తం చేశారు. 10వేల మోతాదుల మొదటి బ్యాచ్‌ను ఈవారం అందుబాటులోకి తీసుకు వ‌చ్చామ‌ని DRDO అధికారులు తెలిపారు. వాటిని కరోనా బాధితులకు ఇస్తున్నట్లు చెప్పారు.

మ‌న దేశంలోనే ఈ మందును DRDO ఓ ల్యాబులో త‌యారు చేసింది. ఇందుకు హైదరాబాద్ బేస్డ్ మెడిసిన్ మేకర్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబరేటరీ సహకారం అందించింది. ఈ కొత్త మందు పేరు 2-DG. అంటే.. 2 డియోక్సీ D గ్లూకోజ్. ఈ మందు ద్వారా కరోనా పేషెంట్లు త్వరగా రికవరీ అవుతున్నారని, మెడికల్ ఆక్సిజన్‌పై ఆధారపడే సమయం కూడా తగ్గుతోంద‌ని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

రీసెర్చర్లు చెప్పిన దాని ప్రకారం దీనిని గతంలో 2-DG వుండే tumorous cancer cells కోసం ఇలా ఉపయోగించే వారు. దీనితో వైరస్ ఎదగకుండా ఉండిపోయేది. వైరస్ గ్రూప్‌ని ఆపడం వల్ల సమస్య తగ్గిపోతుంది. ఈ డ్రగ్‌ని బాడీలోకి పంపిస్తే ఇది ఎదగకుండా దీని డెవల‌ప్‌మెంట్‌ని మనం కట్ చేయవచ్చు. దీనితో ఇది బాడీలో ఇతర ఏ భాగానికి సోకకుండా ఆపుతుందని చెబుతున్నారు. అంతేకాదు బాడీలో ఆక్సిజ‌న్ లెవ‌ల్ స‌మ‌స్య‌ను ఇది అదుపు చేస్తుంది. ఇప్పటి వరకు ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్.. త‌దిత‌ర‌ ప్రాంతాలలో 110 పేషెంట్లను తీసుకుని క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. దీనిని ఉపయోగించిన 3వ రోజుకి ఆక్సిజన్ అవసరం తగ్గిపోయిందని ఆస్పత్రి వ‌ర్గాలు ధృవీక‌రించాయి. క‌రోనాతో పాటు తాజాగా బ్లాక్ ఫంగస్ బారిన కూడా చాలా మంది పడుతున్నారు. ఇటువంటి సమయంలో ఇలాంటివి రావడం వల్ల చాలా మందికి ఉపయోగక‌రంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇక ఈ మందు ధర ఎంత అనేది కంపెనీ ఇప్ప‌టివ‌ర‌కు ఫైన‌ల్ చేయ‌లేదు. ఆరు వంద‌ల రూపాయ‌ల వ‌ర‌కు ధ‌ర‌ను నిర్ణ‌యించే అవ‌కాశం ఉంద‌ని DRDO కంపెనీ ప్ర‌తినిధులు చెబుతున్నారు.

ఈ హెల్థీ ప్రోడక్ట్‌ను నోటి ద్వారా తీసుకోవచ్చు రెండు గ్లాసుల నీళ్ళలో దీనిని మిక్స్ చేసుకుని రోజుకి రెండు సార్లు తీసుకుంటూ ఉండాలి. అవసరాన్ని బట్టి 5 నుంచి 7 రోజుల పాటు దీనిని తీసుకోవడం వలన వైరస్ గ్రోత్ క్ర‌మంగా తగ్గిపోతుంది. ఈ మెడిష‌న్‌ని తీవ్రంగా కరోనా వుండే వాళ్లకి వాడొచ్చని చెబుతున్నారు. హోంఐషోలేష‌న్‌లో రికవరీ అవుతున్న వారు వాడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

2 min read
2 min read
2 min read
Copyright © All rights reserved. | Newsphere by AF themes.