November 21, 2024

Tsdreams

INDIAN NEWS NETWORK

సంచ‌ల‌న నిజాలు భ‌య‌ట‌పెట్టిన జ‌ర్న‌లిస్టు ర‌ఘు

1 min read

హైద‌రాబాద్ (టీఎస్ డ్రీమ్స్ ప్ర‌తినిధి): ఇటీవ‌ల అరెస్ట్ అయిన జ‌ర్న‌లిస్టు ర‌ఘు విడుద‌లై కొన్ని సంచ‌ల‌న నిజాలు భ‌య‌ట‌పెట్టాడు. త‌న‌ను భ‌యంక‌ర రీతిలో అరెస్టు చేశార‌ని, కారులో బ‌ల‌వంతంగా తీసుకెళ్లే స‌మ‌యంలో పోలీసులు త‌న‌పై వ్య‌వ‌హ‌రించిన తీరును తెలిపాడు. భుక‌బ్జాలు, మెడిక‌ల్ మాఫియా, ప్రాజెక్టుల అవినీతి, ప్ర‌జా ప్ర‌తినిధుల కుంభ‌కోణాల‌పై వార్త‌లు క‌వ‌ర్ చేస్తే చంపేస్తామ‌ని హెచ్చ‌రించార‌ని తెలిపారు. త‌న‌ను అరెస్టు చేసిన వాళ్ల‌లో ఒక సీఐ కూడా ఉన్నార‌ని తెలిపాడు. కానీ త‌ను ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌న‌ని తెలిపాడు. త‌న‌ద‌గ్గ‌ర సంచ‌ల‌న రిపోర్టులు ఉన్నాయ‌ని వాటిని భ‌య‌ట‌పెడ‌తాన‌ని ఈ సంద‌ర్భంగా తెలిపాడు.

జ‌ర్న‌లిస్టు ర‌ఘు విడుద‌ల‌య్యాక హైద‌రాబాద్ సోమాజీగూడ‌లో తెలంగాణ జ‌ర్న‌లిస్టులు ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ప‌లువురు తెలంగాణ జ‌ర్న‌లిస్టులు పాల్గొని మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ర‌ఘు భావోద్వేగంగా మాట్లాడారు. త‌న‌ను అరెస్ట్ చేస్తార‌ని ముందే ఊహించానని తెలిపాడు. చాలా మంది త‌న‌ను చంపుతామ‌ని బెదిరించారని, ప్రభుత్వ విధానాలు ప్రశ్నించే వారి పై కుట్రలు పన్నుతున్నారు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఎలా ప్రవర్తించారో అందరూ చూశారని, తెలంగాణలో జర్నలిజం బతికి తీరుతుందని చెప్పుకొచ్చాడు. ఒక మిలియన్ మార్చ్, ఒక సాగర హారం లో తెలంగాణ జర్నలిస్ట్ ల తెగువ తెలుస్తుందని. తెలంగాణ రాష్ట్రం గుప్పెడు మంది చేతిలో ఉందన్నాడు. దొరల చేతిలోని భూమి సామాన్యునికి అందాల‌ని, భవిష్య‌త్తులో అన్ని బయటికి తీస్తామ‌ని, గుర్రం పోడులో 60 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమి పై అధికారులు గబిల్లాల మారిపోయారని తెలిపారు.

ఇంకా జ‌ర్న‌లిస్టు ర‌ఘు మాట్లాడుతూ.. ”న్యాయం కావాలని వెళ్లిన వారిపై లాఠీ లతో కొట్టారు. రాళ్ళ తో కొట్టారు.. తమకు న్యాయం చేయాలని రైతులు జర్నలిస్ట్ గా నన్ను ఆశ్రయించారు. గుర్రం పోడు లో రైతుల పై దాడి చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు. నన్ను అరెస్ట్ చేసిన వారిలో ఒక సి ఐ కూడా ఆరోజు రైతుల పై దాడి చేశారు. గిరిజన రైతులకు పట్టాలు ఇస్తామని కెసిఆర్ చెప్పాడు ఇచ్చారా ?. ఒక్కో రైతు రెండు మూడు బోర్లు వేసుకుంటే వాటిని ద్వంసం చేశారు. నన్ను అరెస్ట్ చేయటానికి భూమి వ్యవహారం ఒక కారణమైతే రాష్ట్రం లో హాస్పిటల్ పై మెడికల్ మాఫియా ఆగడాలు ప్రశ్నించినందుకు నన్ను అరెస్ట్ చేశారు
ఒక్కో పేషంట్ నుండి 20-60 లక్షలు వసూలు చేశారు. ఆధారాలు లేకుండ నేను ఎలాంటి ఆరోపణ చేయను. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ మాఫియా బయట పెట్టాను నా అరెస్ట్ కు రెండు రోజుల ముందు. కోర్ట్ కు 65 లక్షలు ఇచ్చాం అని చెప్తూ న్నారు.

ఆ 65 లక్షలు ఇద్దరు పేషంట్ల బిల్లు ల ఖర్చు కూడా కాదు. నా గొంతులో చివరి శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసం నిలబడుతానంటూ ర‌ఘు చెప్పుకొచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.