December 1, 2025

Tsdreams

INDIAN NEWS NETWORK

హీరో సుమ‌న్ ఆవిష్క‌రించిన‌ “సెక్సీ స్టార్” పోస్టర్

చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం “సెక్సీ స్టార్”. ఓ కొడుకు వ్యధ అనేది ట్యాగ్ లైన్ . లయన్ కుప్పిలి శ్రీనివాస్ సరసన హ్రితిక సింగ్, సాధన పవన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటులు సుమన్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైద‌రాబాద్ లో లాంచ్ చేశారు.

అనంతరం సీనియ‌ర్ న‌టుడు సుమన్ మాట్లాడుతూ.. “నేను నటించిన చిత్రం సెక్సీ స్టార్ పోస్టర్ లాంచ్ చేయడం చాలా సంతోషగా ఉంది. షూటింగ్ లో పాల్గొన్నంత వరకు, నేను చేసిన సన్నివేశాలు దర్శక నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా తీశారు.. హీరో కుప్పిలి శ్రీనివాస్ కు మంచి టెస్ట్ ఉంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్నారు.. మిగతావి ఎలాగో ఉన్నాయో చూడాలి. త్వరలో చూస్తాను. ఒక్కటి అయితే చెప్పగలను. ఈ సినిమా కథ తండ్రీకొడుకుల మధ్య సెంటిమెంట్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ప్రతిఒక్కరికి నచ్చుతుంది” అని తెలిపారు. ఈ కథను తెలుగుతో పాటు మిగతా భాషల్లో డబ్బింగ్ చెయ్యాలని చిత్రయూనిట్‌ను ఆయ‌న‌ కోరారు.

హీరో కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ.. “నా అభిమాన హీరో సుమన్ గారు మా సినిమాలో నటించడమే కాదు. మూవీ పోస్టర్ లాంచ్ చేయడం సంతోషగా ఉంది” అన్నారు. ఈ సినిమాను చాలా ఇష్టంగా చేశాను. మంచి టెక్నిషియన్స్ తో ఈ సినిమా చేసాము అని తెలిపారు. ప్రేక్షకుల దీవెనలు మా సినిమా పై ఉండాలని ఆశిస్తున్నాము అన్నారు.

రచయిత శివప్రసాద్ ధరణ కోట మాట్లాడుతూ.. “సెక్సీ స్టార్ అంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు .. సెక్సీ అనేది చాలా పవిత్రమైన పదం.. బాగా ఉందని చెప్పడానికి ఈ పదం వాడుతాము.. సెక్సీ స్టార్ చిత్రానికి డైలాగ్స్ రాశాను.. హీరో గారు బాగా నటించారు.. ఈ సినిమా లో మంచి మెసేజ్ ఉంటుంది” అని అన్నారు.

సంగీత దర్శకులు జై సూర్య మాట్లాడుతూ.. “ఈ సినిమా లో 5 పాటలు ఉన్నాయి.. అవి అంద‌రికీ నచ్చుతాయి” అన్నారు.. సినిమా కూడా అందరికి నచ్చుతుందని అన్నారు…

ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్ హంగామా కృష్ణ , కెమెరా మెన్ పొడిపై రెడ్డి శ్రీను , గబ్బర్ సింగ్ బ్యాచ్ తో పాటు వివేకానంద నగర్ కాలనీ నాయకులు పాల్గొన్నారు..

నటీనటులు : సుమన్ ,సమీర్ ,కృష్ణ భగవాన్ ,అశోక్ కుమార్ , కోటేశ్వరరావు
బ్యానర్ : శ్రీ సూర్య నారాయణ క్రియేషన్స్
సమర్పణ : చిన్ని కుప్పిలి
కథ, నిర్మాత : లయన్ కుప్పిలి వీరచారి
డైరెక్టర్ : రాజేంద్రప్రసాద్ కట్ల
హీరో హీరోయిన్లు : కుప్పిలి శ్రీనివాస్ (హీరో ) , హ్రితిక సింగ్ , సాధన పవన్ (హీరోయిన్స్)
రచయిత : శివప్రసాద్ ధరణికోట
పర్యవేక్షణ : కె.ప్రశాంత్
కొరియోగ్రాఫర్ : అమ్మ రాజశేఖర్
డి.ఓ.పి: పొడిపై రెడ్డి శ్రీను
మ్యూజిక్ డైరెక్టర్ : జై సూర్య

పాటలు: సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, అనంత్‌ శ్రీరామ్, జై సూర్య
సింగర్స్: సునీత, మాళవిక, మోహన బోగరాజు, సింహ, ధ‌నుంజయ్, శ్రీ కృష్ణ, దీపు

ఫైట్స్: హంగామా కృష్ణ
ఎడిటర్: ప్రణీత, ఎన్టీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

2 min read
2 min read
2 min read
Copyright © All rights reserved. | Newsphere by AF themes.