December 1, 2025

Tsdreams

INDIAN NEWS NETWORK

హైదరాబాద్‌లో తరపు జాన్సన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం

1 min read

హైదరాబాద్‌: H & R జాన్సన్ తమ అత్యాధునిక ఎక్స్‌పీరియన్స్ సెంటర్ – హౌస్ ఆఫ్ జాన్సన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. హైదరాబాద్, 19 జూలై 2023: భారతదేశంలో ప్రముఖ సిరామిక్ టైల్స్ తయారీదారులలో ఒకటి కావటంతో పాటుగా ప్రిజం జాన్సన్ లిమిటెడ్ యొక్క విభాగం, హెచ్ & ఆర్ జాన్సన్ (ఇండియా) తెలంగాణలోని హైదరాబాద్‌లో తమ సరికొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్ – హౌస్ ఆఫ్ జాన్సన్‌ను ప్రారంభించింది. ఈ ప్రత్యేకమైన షోరూమ్ 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2,000 కంటే ఎక్కువ టైలింగ్ కాన్సెప్ట్‌లు, డిస్‌ప్లే మాక్-అప్‌లతో ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది JSP జూబ్లీ క్రౌన్, రోడ్ నంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ -500 033 వద్ద ఉంది.

ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు మరియు జాన్సన్ డీలర్‌లతో పాటు H & R జాన్సన్ (ఇండియా) యొక్క టాప్ మేనేజ్‌మెంట్ – టైల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ శ్రీ విజయ్ మిశ్రా మరియు టైల్స్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్, శ్రీ నర్సింగ్ రావు, ఇతరులు పాల్గొన్నారు. షోరూమ్‌ను టైల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ శ్రీ విజయ్ మిశ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ హోమ్ స్టైలింగ్ ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంపై హౌస్ ఆఫ్ జాన్సన్ దృష్టి పెట్టింది. ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ జాన్సన్ బ్రాండ్ నుండి టైల్స్, శానిటరీవేర్, బాత్ ఫిట్టింగ్‌లు మరియు ఇంజినీర్డ్ స్టోన్స్‌ను ఒకే గూటి క్రింద అందిస్తుంది, ఇది సరికొత్త డిజైన్‌లను అందించడమే కాకుండా ఎంపిక ప్రక్రియలో కస్టమర్‌ల విలువైన సమయాన్ని కూడా ఆదా చేస్తుంది…” అని అన్నారు.
H & R జాన్సన్ (ఇండియా) బహుళ ప్రసిద్ధ టైల్స్ బ్రాండ్‌లను కలిగి ఉంది, వీటిలో జాన్సన్ టైల్స్, జాన్సన్ మార్బోనైట్, జాన్సన్ పోర్సెలానో మరియు జాన్సన్ ఎండ్యూరా వున్నాయి. ఇది జాన్సన్ బాత్‌రూమ్స్ బ్రాండ్ పేరుతో శానిటరీవేర్ మరియు బాత్ ఫిట్టింగ్‌లను మరియు జాన్సన్ మార్బుల్ & క్వార్ట్జ్ బ్రాండ్ పేరుతో ఇంజనీరింగ్ మార్బుల్ మరియు క్వార్ట్జ్ ఉత్పత్తులను అందిస్తుంది.
ఈ సందర్భంగా హెచ్ అండ్ ఆర్ జాన్సన్ (ఇండియా) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సిఇఒ శ్రీ శరత్ చందక్ మాట్లాడుతూ, “హెచ్ అండ్ ఆర్ జాన్సన్ (ఇండియా) ప్రపంచంలోని అగ్రశ్రేణి టైల్ తయారీదారులలో ఒకటి జాన్సన్. నాణ్యత మరియు ఉత్పత్తి ఆవిష్కరణలు కోసం ప్రసిద్ధి చెందింది. “హౌస్ ఆఫ్ జాన్సన్(లు)”ని దేశవ్యాప్తంగా ప్రారంభించాలనే మా లక్ష్యం గృహ పరిష్కారాలు మరియు జీవనశైలి ఉత్పత్తుల కోసం కొనుగోలు మరియు ఎంపిక ప్రక్రియను మెరుగుపరచడం లో భాగం. ఎందుకంటే ఇది నివాస మరియు వాణిజ్య స్థలాలను ప్లాన్ చేయడానికి మరియు రూపకల్పన చేయడానికి వన్ -స్టాప్-షాప్‌గా పనిచేస్తుంది. హైదరాబాద్‌లోని ఈ నూతన తరపు ఎక్స్‌పీరియన్స్ కేంద్రం ఆ దిశగా ఒక అడుగు…” అని అన్నారు.

జాన్సన్ ప్రణాళికాబద్ధమైన కేంద్రాల కోసం ఎంపిక చేసిన నగరాలలో హైదరాబాద్ ఒకటి, ఇది దేశంలోని ప్రసిద్ధ బ్రాండ్ – జాన్సన్ నుండి చాలా సరసమైన ధరలో అంతర్జాతీయ ఖ్యాతి మరియు బాత్రూమ్ ఉత్పత్తుల యొక్క అత్యుత్తమ-తరగతి టైల్స్‌ను తీసుకువస్తుంది. ఇతర 20 అనుభవ ఎక్స్‌పీరియన్స్ కేంద్రాలుమహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ & NCR, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు ఒడిశాలో ఉన్నాయి. టైల్స్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ నర్సింగ్ రావు మాట్లాడుతూ, “ఈ అత్యాధునిక ఎక్స్‌పీరియన్స్ సెంటర్ మా విశ్వసనీయ ఛానెల్ భాగస్వాములతో మా బలమైన వ్యాపార సంబంధాలను కొనసాగించడానికి మరియు మా బంధాన్ని బలోపేతం చేయడంలో మాకు సహాయపడుతుంది…” అని అన్నారు. ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ చిరునామా: హౌస్ ఆఫ్ జాన్సన్, 3వ అంతస్తు, JSP జూబ్లీ క్రౌన్, ప్లాట్ – 1270, రోడ్ నెం. 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ – 500 033. వెబ్‌సైట్: www.hrjohnsonindia.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

2 min read
2 min read
2 min read
Copyright © All rights reserved. | Newsphere by AF themes.