November 15, 2025

Tsdreams

INDIAN NEWS NETWORK

Review: ది డీల్ సినిమా రివ్యూ

1 min read

టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు కొత్తగా వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “ది డీల్”. డా. హను కోట్ల దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన చిత్రం. సిటాడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకు దర్శకుడిగా ఆయన పరిచయమయ్యారు. సాయి చందన, ధరణి ప్రియా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం తాజాగా అక్టోబర్ 18న థియేట‌ర్‌ల‌లో విడుదలైంది. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతవరకు ఎంజాయ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం.

Story:
భైరవ (హనుకోట్ల) యాక్సిడెంట్ వల్ల కోమాలోకి వెళ్తాడు, కొన్నాళ్లకు కోమా నుంచి బయటకు వస్తాడు. తాను గతం మర్చిపోతాడు, కానీ తన భార్య లక్ష్మి (ధరణి ప్రియా) గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆమె కోసం వెతికే క్రమంలో తన జీవితంలో జరిగిన అనేక అనుమానాస్పద సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఈ నేపథ్యంలో ఇతను ఇందు (సాయి చందన) అనే అమ్మాయిని హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్న ఓ గ్యాంగ్‌ను ఆపడానికి తన ప్రాణాన్ని పణంగా పెడతాడు.

కథలో కీలక మలుపులు, ట్విస్టులు కథనానికి మరింత ఉత్కంఠను తెస్తాయి. భైరవ భార్య లక్ష్మి, గ్యాంగ్ సభ్యులు, మరియు ఇందు మధ్య ఉన్న సంబంధం అసలు కథను ఆసక్తికరంగా మార్చుతుంది. ఇందు చుట్టూ తిరిగే సంఘటనలతో కథ పూర్తిగా కొత్త మలుపులు తీసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో భైరవ ఎవరన్నదే సినిమాలోని సస్పెన్స్ హైలైట్.

Actors:
హనుకోట్ల తన పాత్రలో సహజంగా నటించారు. ఆయన నటనలో వేరియేషన్స్ బాగున్నాయి, ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో మంచి ప్రదర్శన కనబరిచారు. సాయి చందన నటన ఆకట్టుకునేలా ఉంది, ఆమె పాత్రలోని సెంటిమెంట్ సీన్లలో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ధరణి ప్రియా పాత్రలో కొన్ని కీలక ట్విస్టులు ఉండడం ఆసక్తి రేపింది. రవి ప్రకాష్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో బాగా మెప్పించారు.

Technical:
ధృవన్ అందించిన నేపథ్య సంగీతం కథకు బలం చేకూర్చింది, ముఖ్యంగా కీలక సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. సురేంద్ర రెడ్డి కెమెరా వర్క్ బాగా సాగింది, కొన్ని సీన్లు క్లాస్‌గా తీర్చిదిద్దడం వల్ల సినిమాకు విలువ పెరిగింది. ఎడిటింగ్ పరంగా కొంచెం మరింత జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమాకు మంచి టెంపో వచ్చేది.

Analysis:
“ది డీల్” సినిమా సస్పెన్స్, థ్రిల్లర్ కథా తీరును ఆసక్తికరంగా మలచింది. దర్శకుడు చెప్పిన విధానం, ట్విస్టులు కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. కథా నడకలో కొంచెం కఠినతరం అయినా, సెకండాఫ్‌లో సస్పెన్స్ మరింతగా పెరిగి ప్రేక్షకులను చివరి వరకు కూర్చోబెడుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి.

  • ముగింపు: ది డీల్.. ఇది సస్పెన్స్ థ్రిల్లర్

Rating: 3.25 / 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

2 min read
2 min read
2 min read
Copyright © All rights reserved. | Newsphere by AF themes.