March 28, 2025

Tsdreams

INDIAN NEWS NETWORK

తెలంగాణ‌లో ఆయుష్మాన్‌ భారత్‌: కేసీఆర్‌ కీలక ఆదేశాలు

ప్ర‌గతి భ‌వ‌న్‌లో కీల‌క‌ విభాగాల అధికారుల‌తో స‌మీక్ష‌, స‌మావేశం..

హైదరాబాద్ (టీఎస్ డ్రీమ్స్ ప్ర‌తినిధి): తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) ఆదేశించారు. ఈ నేపథ్యంలో నేషనల్ హెల్త్ అథారిటీతో తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారు చేసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో వైద్య సేవలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.