కోవిడ్‌ను ఎలా నిర్ధారించాలి?
1 min read
Fever, cough and shortness of breath were early on identified as symptoms of COVID-19, but additional symptoms are emerging.
కోవిడ్ పాజిటివ్ వస్తే చాలు తమకు ఏదో అవుతుందనే ఆందోళన పెరిగిపోతుంది. ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడేలా హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రో ఎంటరాలజీ.. ఏఐజీ నిపుణుల బృందం ఒక మార్గదర్శినిని రూపొందించింది. ఇందులో భాగంగా కోవిడ్‌ను నిర్ధారించే పద్ధతులను కూడా వివరించారు. కోవిడ్‌కు ఆర్టీపీసీఆర్ సరైన కొలమానం పరీక్ష అని చెబుతున్నారు. ఆర్టీపీసీఆర్ అందుబాటులో లేని, పరీక్ష ఫలితాలు ఆలస్యమైన సందర్భాల్లో సీటీస్కాన్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలో కచ్చితత్వం తక్కువ. నెగెటివ్ వచ్చినా ధీమా పనికిరాదు. ఆర్టీసీఆర్ తప్పనిసరి. ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ వస్తే వ్యాధి నిర్ధారణ అయినట్లే.
సీటీస్కాన్ అనగానే కొరాడ్ స్కోర్ ఎంత అనేది ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్న. నిజానికి కొరాడ్ స్కోర్ అంటే కేవలం నిర్ధారణ పరీక్ష మాత్రమే. అది కొవిడ్ తీవ్రత తెలిపేది కాదు. ఈ స్కోర్ ఎంత ఉంటే కొవిడ్‌గా నిర్ధారించాలి అనేది కీలకం. ఇక కొవిడ్ నిర్ధారణ అయినా ఆందోళన అవసరం లేదు. స్వల్ప లక్షణాలు ఉంటే ఇంట్లో ఉంటూ చికిత్స తీసుకోవచ్చు. అలాంటి వాళ్లు కరోనా తీవ్రతపై స్వీయ మదింపు చేసుకోవాలి. తీవ్ర నీరసం, ఆయాసం, ఒళ్లు నొప్పులు, దగ్గు, జ్వరం, డయేరియా, శరీరంపై దద్దుర్లు ఉంటే వైద్యులను సంప్రదించాలి. ఈ సమయంలో థర్మామీటర్, పల్స్‌ఆక్సిమీటర్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, మధుమేహం రోగులకు బ్లడ్ గ్లూకోజ్ మానిటర్, ఎన్95 మాస్క్‌లు, సర్జికల్ మాస్క్‌లు అందుబాటులో ఉంచుకోవాలి. ప్రతి 8 గంటలకు ఒకసారి జ్వరం చూసుకుంటూ నమోదు చేసుకోవాలి. ప్రతి 4 గంటలకు ఒకసారి ఆక్సిజన్ స్థాయిలను నమోదు చేయాలి. ప్రతి రోజూ రక్తపోటు నమోదు తప్పనిసరి. రెండు రోజులకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నమోదు చేయాలి. జ్వరం ఉంటే ప్రతి 6 నుంచి 8 గంటలకు పారాసెటమాల్ వాడాలి. వైద్యుల సూచనతో ఇన్‌హేలర్ వాడాలి. విటమిన్ D కి సంబంధించిన అప్‌రైజ్ డి-3, 60కె, ఒక గ్రాము విటమిన్ C వాడాల్సి ఉంటుంది, వైద్యుల సూచనలతో పరీక్షలు తప్పనిసరి.