December 1, 2025

Tsdreams

INDIAN NEWS NETWORK

సులభ మార్గంలో ఆక్సిజన్..

  • కార్గో విమానాల్లో ట్యాంక‌ర్ల ద్వారా తెలంగాణ‌కు ఆక్సిజన్‌ ర‌వాణా‌..
  • రవాణాలో జాప్యాన్ని నివార‌ణ‌కు ప‌క్కా వ్యూహంతో ముందుకు..
  • పోలీస్ ఎస్కార్ట్ తో పాటు మేకానిక్‌, సాంకేతిక నిపుణుల బృందాలను ఏర్పాటు చేయండి..ఆధికారులకు సీఎస్ అదేశం.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ట్రాన్స్ పోర్టు, ఆర్.టీ.సీ అధికారులతో బిఆర్‌కేఆర్‌ భవన్ లో శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను పంపి , తిరిగి తెప్పించుటలో వేగాన్ని పెంచుటకై చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. తెలంగాణ రాష్ట్రానికి ఒడిశాలోని అంగూర్ నుండి , కర్టాటక లోని బళ్లారి నుండి మెడికల్ ఆక్సిజన్ ను ట్యాంకర్ల ద్వారా తెప్పిస్తున్నామని ప్రధాన కార్యదర్శి తెలిపారు. రవాణాలో జాప్యాన్ని నివారించుటకు పోలీస్ ఎస్కార్ట్ వాహనాలతో పాటు, మేకానిక్ లు,ఇతర నిపుణుల బృందాలను ఏర్పాటు చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ ట్యాంకర్లతో ప్రయాణించే ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్‌ కు రైల్వే శాఖ ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ సదుపాయాన్ని వినియోగించుటకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తద్వారా అంగూర్ కు ప్రయాణ సమయాన్ని ఆరు రోజుల నుండి మూడు రోజులకు తగ్గించగలుగుతామని పేర్కొన్నారు. కార్గో విమానాల ద్వారా సులభంగా ఆక్సిజన్ ట్యాంకర్లను తరలించుటకు అనువుగా ట్యాంకర్లకు తగు మార్పులు చేయాలని అధికారులకు సూచించారు.

నిర్దేశిత పాయింట్లకు ఆక్సిజన్ ట్యాంకర్లను నడపుటకు 24 గంటలు పని చేసే విధంగా ఆర్.టి.సి. డ్రైవర్లు, మెకానిక్ ల బృందాలను ఏర్పాటు చేయాలని రవాణా అధికారులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ప్రస్తుతం వున్న 30 ఆక్సిజన్ ట్యాంకర్లకు అదనంగా మరికొన్ని ట్యాంకర్లను సమకూర్చుకొనుటకు ప్రైవేట్ కాంట్రాక్టర్లతో చర్చించాలని ఆదేశించారు.

కార్గో విమానాల్లో ట్యాంక‌ర్ల ద్వారా తెలంగాణ‌కు ఆక్సిజన్‌ ర‌వాణా‌..

ఈ సమావేశంలో రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, జిఏడి ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ , పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల సిఐజి శేషాద్రి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, రవాణా శాఖ కమిషనర్ యం.ఆర్.యం.రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

2 min read
2 min read
2 min read
Copyright © All rights reserved. | Newsphere by AF themes.