కరోనాతో అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ మృతి
కరోనా బారిన పడి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అండర్ వరల్డ్ డాన్, గ్యాంగ్ స్టర్ ఛోటా రాజన్ మృతి చెందారు. కొద్దిసేపటి క్రితం ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. ఢిల్లీ తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఛోటా రాజన్‌కు పది రోజుల క్రితం కరోనా సోకింది. ఆయనకు కరోనా లక్షణాలు ఉండటంతో జైలు అధికారులు ఎయిమ్స్‌కు తరలించారు. అప్పటి నుంచి ఎయిమ్స్‌లో కరోనాకు చికిత్స పొందుతున్న ఛోటా రాజన్ ఈ రోజు కన్నుమూశారు. రాజన్‌పై 70 వరకు క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో ఎక్కువశాతం కిడ్నాప్‌లు, మర్డర్ కేసులే. ఛోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నిఖాల్జే.
సుమారు రెండు దశాబ్దాలుగా భారతో పాటు అనేక ప్రపంచ దేశాలకు దొరక్కకుండా తన క్రిమినల్ కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చిన ఛోటా రాజన్ ఇంటర్ పోల్ వర్గాలు ఇచ్చిన ఇచ్చిన సమాచారంతో 2015లో అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారం మేరకు అతడిని ఇంటర్‌పోల్ వర్గాలు ఇండోనేషియాలోని బాలిలో అరెస్టు చేశారు. ఒకప్పుడు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహిత సహచరుడైన ఛోటా రాజన్.. ఆ తర్వాత అతడికి గట్టి ప్రత్యర్థిగా మారాడు. ముంబై పోలీసులు, భారత నిఘా ఏజెన్సీలు దాదాపు రెండు దశాబ్దాలు పాటు అన్వేషణ సాగించారు. 1995 నుంచి తప్పించుకున్న ఛోటా రాజన్.. ముంబైలోని నేర సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషించాడనే ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఓ కేసుకు సంబంధించి ఇటీవల ఛోటా రాజన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. బిల్డర్ అజయ్ గోసాలియాపై హత్యాయత్నం కేసులో గ్యాంగ్ స్టర్ ఛోటా రాజన్‌కు ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 10 ఏండ్ల జైలుశిక్ష విధించింది. ఈ కేసులో రాజన్‌తోపాటు మొత్తం 8 మందిని కోర్టు దోషులుగా తేల్చింది. పదేండ్ల జైలుశిక్షతోపాటు5లక్షల రూపాయల జరిమానా వేసింది.
