కేసీఆర్ దళిత ద్రోహి: పొన్నాల
హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): సీఎం కేసీఆర్పై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్ల తర్వాత కేసీఆర్కు దళిత సాధికారత గుర్తుకు వచ్చిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి దళిత్ ఎంపవర్మెంట్ పథకాన్ని తెరపైకి తెచ్చాడని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఒక దళిత ద్రోహి అని ఆయన విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని ఆయన గుర్తు చేశారు. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని పొన్నాల డిమాండ్ చేశారు. సమయం ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తే 43 వేల ఉద్యోగాలు దళితులకు వచ్చేవని ఆయన అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి లాగానే, సీఎం ఎంపవర్మెంట్ పథకం కూడా ఉంటుందని ఆయన విమర్శలు కురిపించారు. దళితుల హత్యలు, వారిపై దాడులు చేసినవారి మీద చర్యలు ఏవని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం కేసీఆర్ కొత్త నాటకాలు ఆడుతున్నారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు.
