తెలంగాణ, తెలుగు ప్రజలకు జీవితాంతం గుర్తుండే పేరు తాటిపల్లి వెంకట రమణారెడ్డి..
- కాషాయ యోధుడు
- ఇద్దరు సీఎం అభ్యర్థులని ఓడించిన కాటిపల్లి
- ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ ఓటమి
- చరిత్ర సృష్టించిన వెంకట రమణారెడ్డి
హైదరాబాద్, టీఎస్ డ్రీమ్స్, డిసెంబర్ 3: తెలంగాణలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా నూతనంగా ఎన్నికయ్యారు. అయితే రమణారెడ్డి చేతిలో ఓడిన వారిలో ఒకరు రెండుసార్లు ముఖ్యమంత్రి చేసినవారు.. ఒకరు నూతనంగా ముఖ్యమంత్రి అవుతుండడం, ఒక ఎత్తయితే, ఒకరు ప్రతిపక్ష నాయకుడు కావడం, అదీ ఒకే సభలో ఉండడం కూడా ఆశ్చర్యం,అనూహ్యం అని మేధావులు, రాజకీయ విశ్లేషకులు సీనియర్ పొలిటికల్ చర్చించుకుంటున్నారట. ఈ శతాబ్దంలో ఇటువంటి ఫీట్ బ్రేక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదని బీజేపీ జాతీయ, నేతలు కేంద్ర మంత్రులు చెప్తున్నారు.

తెలంగాణ తెలుగు ప్రజలకు జీవితాంతం గుర్తుండే పేరు తాటిపల్లి వెంకట రమణారెడ్డి…
ముఖ్యమంత్రిని, నే(తా)నే ముఖ్యమంత్రినని చెప్పుకుంటున్న ఇద్దరిని ఒకేసారి ఓడించి చరిత్ర సృష్టించిన యోధుడని బిజెపి శ్రేణులతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కొనియాడుతున్నారు.
