నకిలీ బిడి ఉత్పత్తులపై..టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం

హైదారాబాద్, టీఎస్ డ్రీమ్స్ : అక్రమార్జనే ద్యేయంగా నకిలీ బిడిలు తయారుచేస్తున్న ఉత్పత్తుల కంపేనీలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. హన్మకొండ జిల్లాలో పలు చోట్ల భారీ ఎత్తున ప్యాకెట్లు పట్టుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌పోర్స్ పోలిసులు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటిలో అక్రమంగా నిల్వఉంచిన వివిధ రకాల బ్రాండ్ల నకిలీ ఉత్పత్తుల బీడీ ప్యాకెట్లను పట్టుకున్నారు. ఈ దాడిలో పోలీసులు ఓ ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. వారి నుండి 13, 32800 రూపాయల నకిలీ ఉత్పత్తుల బీడీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఆదేశాల మేరకు టీముతో సీఐలు,ఎస్ఐలు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది అద్వర్యంలో దాడుల్లో పాల్గోన్నారు.
