January 16, 2026

Tsdreams

INDIAN NEWS NETWORK

నక్క వినయం, కీచక పర్వం

  • జీహెచ్ఎంసీలో ఉద్యోగం.. కింది స్థాయి సిబ్బందిపై వేధింపుల నిత్యకృత్యం
  • ఆయనకు అన్ని ఉచితంగానే రా(కా)వాలట..కాదు? కూడదంటే బెదిరింపులే!

హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): అతనిది పది మందికి సహాయపడే ఒక బాధ్యతగల ఉద్యోగం. తన వద్దకి వచ్చే వినియోగదారులు, కింది స్థాయి సిబ్బంది, ఉద్యోగుల పట్ల మర్యాదగా నడుచుకోవాల్సిన విధి అతనిది. కానీ.. చేసేవన్ని నీచ, కీచక, దుర్మార్గపు పనులే అని అతని బాధితులు చేప్తుంటారు. తన కింద పనిచేసే మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, సిబ్బంది సానిటేషన్ ఫీల్డ్స్ అసిస్టెంట్స్ (ఎస్ ఎఫ్ ఏ)లపై వేధింపులు నిత్యకృత్యం. పెనాల్టీ పేరుతో వసూళ్లు చేసిన డబ్బులు కట్టకుండా సొంతానికి వాడుకోవడం, లెక్కలు తెలవకుండా రశీదు పుస్తకాలు దాయడంతో విషయం బయటకు పొక్కి సస్పెన్షన్ కు గురయ్యారు. అటెండెన్స్ పేరుతో, తనకు నచ్చిన వారికి అటెండెన్స్ వేయడం, వేయించడం, తాను మాట చేప్తే వినని వారికి బయోమెట్రిక్ మిషన్ తో అటెండెన్స్ పేరిట ఇబ్బందులకు గురి చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అతని పాపాల పుట్ట బయట పడకుండా ఉండేందుకు ఉన్నతాధికారుల వద్ద నక్క వినయాలు, వంగి వంగి దండాలు పెట్టడం, తానే మొత్తం పని చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తూ అధికారులని నమ్మించడం అతనికి వెన్నతో పెట్టిన (మరో విద్య,) ఓ ప్రత్యేక కళ అని చెప్పకతప్పదు. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. అతని గురించి చెప్తే, చరిత్ర దాచనంతగా ఉంటుందన్నది నగ్న సత్యం. ఉప్పల్ జీహెచ్ఎంసీలో ఇన్ ఛార్జ్ (టెంపరరీ) జవాన్ గా విధులు నిర్వహించే ఓ ఉద్యోగి చేసే పనులు. అరాచకాలు, నీచ, కుటీల, వక్రపు బుద్దితో చేసిన, చేస్తున్న అగడాలు, ఓ బాలీవుడ్ సినిమాకు తక్కువేం కాదు? అన్నట్లుగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు?. అవును అతనేవరో కాదు? జవాన్ డప్పు రాజు.. జీహెచ్ఎంసీ సర్కిల్-2 ఉప్పల్ లో కామాటిగా మొదలై, సానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తూ, జవాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. జీహెచ్ ఎంసీలో ఇప్పటి వరకు పర్మినెంట్ కాకుండా వందల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. అధికారులు, పొలిటికల్ గా తనకు ఉన్న బంధుగణం, బలం, యూనియన్ నేతల సపోర్ట్ తో ప్రమోషన్ సంపాదించాడని తోటి కార్మికులు టాక్. కానీ, తనకు వచ్చిన ప్రమోషన్ కూడా అంతే తొందరగా పక్కన పెట్టేశారు. దీంతో టెంపరరీ జవాన్ గా పనిచేస్తున్న అతను.. గతంలో ఉన్న వక్ర బుద్దిని మరోసారి ప్రదర్శించాడు. ఇంకేముంది. తనలో లోపల దాగి ఉన్న (గజిని) రెండవ మనిషిని బయటపెట్టాడు. తాజాగా.. ఉప్పల్ రింగ్ రోడ్ సమీపంలో చిల్కానగర్ జంక్షన్ వద్ద గల బాలాజీ స్వీట్ హౌస్ కు వచ్చిన ఓ వ్యక్తి ఆదివారం హల్ చల్ చేశాడు. తాను అడిగితే ఉచితంగా సమోసాలు ఇవ్వవా అంటూ వచ్చిన వ్యక్తి అవతల వ్యక్తికి ఫోన్ చేసి షాప్ యాజమానికి ఫోన్ మాట్లాడమంటూ ఫోన్ ఇచ్చాడు. రాజు అసిస్టెంట్ నుంచి ఫోన్ తీసుకున్న షాప్ యాజమాని అతని మాటలు, బెదిరింపు ధోరణితో ఒక్కసారిగా నివ్వరపోయాడు. అవతల వ్యక్తి రేపు ఉదయం నీ షాప్ ఎలా నడుపుతావో, అక్కడ ఎలా ఉంటుందో చూస్తానంటూ బెదిరించినట్లు బాధితుడు ఓం ప్రకాశ్ ఆరోపించాడు. నేను పంపిస్తే ఏదైనా ఇవ్వాల్సిందే అంటూ ఒంటి కాలిపై ఫైర్ అయ్యాడు. ఎందిరా తమషాగా ఉందా? అడిగింది ఇవ్వకపోతే నాకు ఎక్కడో సర్రున కాలుతుందని గద్గర స్వరంతో గట్టిగ ఫోన్ లోనే అరిచాడు. దీంతో షాప్ యాజమాని సైతం బయపడలేదు. వెనుకడగు వేయ్యకుండా నువ్వు ఎవరూ నీకు ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి?, ఎక్కడున్నావో ముందు షాప్ దగ్గరికి రా.. నీవు ఎంచేస్తావంటూ గట్టిగా నిలిదీశాడు. రేపు మీ జీహెచ్ ఎంసీ ఆపీసుకు వస్తాను, మీ ఉన్నతాధికారులతో మాట్లాడుతాను, ఎం బెదిరిస్తున్నావా?, తమషాలు చేస్తున్నావా నువ్వు అడిగితే ఎందుకు ఉచితంగా ఇవ్వాలి నేను మీ ఉన్నతాధికారులతో మాట్లాడుతానంటూ అవతల నుంచి బెదిరించిన వ్యక్తికి షాప్ యాజమాని కూడా గట్టి కౌంటర్ ఇచ్చాడు. అవతలి వ్యక్తి సైతం అరేయ్ నువ్వు షాప్ ఎలా నడుపుతావో, చూస్తానంటూ అక్కడ గప్ చుప్ బండిని ఎలా పెడతావో! చూస్తానంటూ దమ్కీ ఇవ్వడంతో స్వీట్ హౌస్ యాజమానులు ఓం ప్రకాశ్, రిషబ్ కచవ లు టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధికి మీడియాను ఆశ్రయించాడు. అతని బెదిరింపు ధోరణి విషయాన్ని మీడియా ప్రతినిధికి వివరించారు. తను పంపిన అసిస్టెంట్ వీడియో, ఆడియోను టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధికి అందజేశాడు. ప్రభుత్వం ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్న అతణ్ణి విధుల నుంచి తప్పించాలని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఎస్ డ్రీమ్స్ న్యూస్ ప్రతినిధితో మొర పెట్టుకున్నారు. జవాన్ డప్పు రాజు బెదిరింపు విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బాధితులు ఓం ప్రకాశ్, రిషబ్ లు వెల్లడించాడు.

సానిటేషన్ జవాన్ బెదిరింపు ఆడియో, తన అసిస్టెంట్ వీడియోకు సంబంధించిన కింద చూడగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.