నీ శేష జీవితం.. చర్లపల్లి జైలులోనే
- పూజలతో…నీ పాపాలను అపలేవు?
- పాపాలు కడుకునేందుకే యాగాలా?
- పొన్నాల లక్ష్మయ్య సంచలన ఆరోపణలు
- కేసీఆర్ పై మూడు సీబీఐ కేసులు…?
- అబద్దమైతే గూగుల్ లో వెతకండి.. తెలుస్తది
- 2014 ఏప్రిల్ 14న సీబీఐ ప్రకటించింది.. గుర్తుచేసిన లక్ష్మయ్య
- 20 ఏళ్ల కింద దళిత బంధు ఆలోచన వచ్చిందనడం హాస్యాస్పదం
ఏన్ని పూజలు చేసినా… యాగాలు యగ్నాలు నీ పాపాలను అపలేవు?.. ఇక, మీ శేష జీవితం.. చర్లపల్లి జైలులోనే గడుపాల్సిందే. పాపాలు కడుకునేందుకే యాగాలా? పల్లకి ఎత్తుకున్నట్లు కనిపిస్తొంది. ఇలా ఎన్ని చేసిన ఏం చేసిన మీపై మూడు సీబీఐ కేసులు.? ఉన్నాయంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనీయర్ నేత పొన్నాల లక్ష్మయ్య సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ వాఖ్యలే ఇరు తెలుగు రాష్ట్రంలో హట్ టాపిక్ మారాయి.
హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి) : సీఎం కేసీఆర్ పై మూడు సీబీఐ కేసులు ఉన్నాయని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని 2014 ఏప్రిల్ 14న సీబీఐ ప్రకటించిందని గుర్తు చేశారు. టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలో పొన్నాల లక్ష్మయ్య మాట్లాడారు. కేసీఆర్ పై ఉన్న సీబీఐ కేసుల గురించి ఈ సభలో పొన్నాల బాంబు పేల్చారు. మీకు నేనూ చెప్పేది అబద్దమైతే గూగుల్ లో వెతకండి మీకే తెలుస్తుందంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ పై ఎన్ని సీబీఐ కేసులున్నాయని అడిగితే గూగుల్ వెతికిపెడుతుందని, సీబీఐ కేసుల వివరాలు తెలుస్తాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తాను చేసిన పాపాలను కడుక్కోవడానికి యాగాలు, యజ్ఞాలు పూజలు పునస్కారాలు అంటూ ఏమేమో చేస్తాడు. కానీ ఎన్ని పూజలు చేసినా.. తాను చేసిన పాపాల నుంచి అవి కాపాడలేవని విమర్శించారు. చేసిన పాపాలు పోకపోగా కేసీఆర్ ఎన్ని రోజులు బతికినా చివరికి శేష జీవితం మాత్రం ఎప్పటికైనా చర్లపల్లి జైలులోనే ముగుస్తుందని ఎద్దేవా చేశారు. దత్తత తీసుకున్న గ్రామాల్లో కేసీఆర్ ఎంత అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేశామని.. కానీ కేసీఆర్ కులాల పేరుతో విడదీసి ఓట్లు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 20 ఏళ్ల కింద దళిత బంధు ఆలోచన వచ్చిందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి దళితులకు ఒక్క సహాయమన్నా చేశారా? అని నిలదీశారు.
