ప్రజాతీర్పును మేం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం
- కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇంటికి వెళ్లిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, టీఎస్ డ్రీమ్స్, డిసెంబర్ 3: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అని కేంద్రమంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు.
కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించిన కామారెడ్డి ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.
ఈ విజయంలో సంపూర్ణంగా సహకరించిన బీజేపీ కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదములు
కె. వెంకటరమణారెడ్డి.. ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ముఖ్యమంత్రినని చెప్పుకున్న వ్యక్తిని ఓడించి నిలిచిన ఘనుడని కిషన్ రెడ్డి కొనియాడారు.
ఈ విజయం బీజేపీ కార్యకర్తల మనోబలాన్ని పెంచింది. కాంగ్రెస్ బొటాబొటీ మెజారిటీ సాధించింది. ఇదేమీ భారీ విజయం కాదు. ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ కు కలిసొచ్చింది. ప్రజలు బీజేపీకి అండగా నిలిచారు. 2018లో మాకు ఒక సీటువచ్చింది. 7శాతం ఓట్లొచ్చాయి. 2023లో 14శాతం ఓట్లు సాధించాం. ఇప్పటివరకు 8 సీట్లు వచ్చాయి.
2018 ఎన్నికలు ముగిసిన 4 నెలలకు వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో 4 సీట్లు సాధించాం. ఈ విజయంతో తెలంగాణలోని అన్ని ఎంపీ స్థానాలను గెలుచుకుంటాం. మా ముఖ్యనాయకులు ఓడిపోయారు, దురదృష్టకరం.
మేం ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాం. యావద్భారతీయులు నరేంద్రమోదీ వెంట ఉన్నారు. వీరందరి మద్దతుతో మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా గెలవబోతున్నారు. బీజేపీ సాధించిన ఈ విజయంలో సహకరించిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, బీసీ సంఘాల నాయకులకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ధన్యవాదములు తెలిపారు.

