మహిళ బందు ఉత్సవాలలో వింత ఆచారం..
కేసీఆర్ ఫోటోలకు దండలు, బోట్లు..!
హైదరాబాద్, టీఎస్ డ్రీమ్స్ : తెలంగాణ రాష్ట్రంలో మహిళ బంధు ఉత్సవాలను జరుగుతున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురప్కరించుకొని తెలంగాణ రాష్ట్ర సమితి ఆద్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జరుపుతున్న, నిర్వహిస్తున్న ఉత్సవాలు వారు ఎందుకు జరుపుతున్నారో? దేనికొసం చేస్తున్నారో కూడా చెప్పకపోవడం విశేషం.. గుడ్డేద్దు చెలో పడ్డట్లు.. ఎనకటికి ఓ సామేత ఉండేది ముందువొయిన ఓ గొర్రే పిల్ల నీల్ల కోసం బావిలోకి దిగితే.. అది తెలియని వెనుక నుంచి వచ్చె గొర్రేలన్ని ఈ కుటీరం మనదే కావచ్చూ అని దూకిన సందర్భం గుర్తొస్తొంది.. ఇది గులాబీ పార్టీ నేతలకు అచ్చుగుద్దినట్లు సరితూగుతదని చెప్పకతప్పదు. వారేం చేస్తున్నారో తెలియదు? పైనుంచి వచ్చే పార్టీ అదేశాలను పాటిస్తూ.. పాపం ఏం తెలియని కొందరు అమాయక పార్టీ మహిళల్ని వేనకేసుకొని కార్యక్రమాలు చేయడం పారిపాటిగా మారింది. ఈ నేపధ్యంలో వారు చేసేది తప్పా? కరెక్టా అనేది చూసుకునేంత జ్ఞానం కూడా వారికి లేకపోవడం అందుకు నిదర్శనం.. అయితే, ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిదంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొందరు పింకి నేతల తీరు అలాగే ఉంది మరి. ఉదా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జ‘రి’(గి)పిన ఈ మహిళ బందు ఉత్సవాలలో కేసీఆర్ ఫోటోలు పెట్టి ఆ ఫోటోకు బోట్లువెట్టి, దండలు వేసి దండం పెట్టడం శోచనీయం. ఇది తెలంగాణ భాషలో చెప్పాలంటే కేసీఆర్ బ్రతికి ఉండగానే నివాళులు అర్పించినంతా పనిచేశారు. పూలు చల్లి కేసీఆర్ ఫోటో వద్ద స్వీట్లువెట్టి పిండాలు పెట్టినంత పని చేశారని రాజకీయ విమర్శకులు చెప్తున్నారు. పాపం ఆ మహిళ కార్యకర్తల తప్పేం లేదు.. వారు చెప్పారు. వీరు చేశారు. అవగాహన లేకా తాము ఎదో పొడిచాం అంటూ పీంకీ అగ్ర నేతలు చేసిన అత్యుత్సాహమే ఇక్కడ కనిపిస్తొంది. టీఆర్ఎస్ అధినేతను పొగడబొయి, మంత్రులు, తమ అగ్రనేతల ముందు తామేదో గొప్ప చేశామని చూపించుకునేందుకు చేసిన తాపాత్రాయం ముందు ఎడ్డి నేతల తీరుతో ఎమి తెలియని అమాయక మహిళలతో ఉత్సవాలు చేయించి, తమ పరువు తామే తీసుకున్నారని పోలీటికల్ విశ్లేశకులు అభిప్రాయపడుతున్నారు.

కొన్ని చోట్ల రాఖీ పండుగలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల పాలాబీ షేకాలు, మరికొన్ని చోట్ల కేసీఆర్ మహిళా దినోత్సవ పోటీలు నిర్వహించడం విశేషం.. వీరిని చూసి తెలంగాణ జనాలు, యువకులు నవ్వుకుంటున్నారు. ఈ ఉత్సవాల్లో వరంగల్ జిల్లాలో కొంకపాక గ్రామంలో ఇలాంటి వింత జరగడం చూసి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు జరిగిన దారిద్రాన్ని చూసి ముక్కున వెలేసుకుంటున్నారు.

