రక్షించరు, గోవులను కాపాడితే అరెస్టులా?: రాజాసింగ్
- హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది: రాజాసింగ్
హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): గో సంరక్షణకు పాటుపడే వారిపైనే పోలీసులు కేసుపెడుతన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డీజీపీకి సవాల్ విసిరారు. కబేళాకు వెళ్లే ఆవులను అడ్డుకోవడానికి నేనే స్వయంగా వెళ్తున్నా.. డీజీపీ ముందు నన్ను అరెస్టు చేయాలన్నారు. కబేళాకు తరలిస్తున్న ఆవులను ఆపి పోలీసు స్టేషన్లకు తీసుకొచ్చే వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం స్లీపర్ సెల్ లకు , ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆయన ఆరోపించారు.
తెలంగాణ పోలీసులకు అసలు టెన్షన్ లేదు, భద్రతను గాలికి వదిలి బక్రీద్ ను విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పోలీస్ అధికారులు ఆవులు కోతకు పోకుండా అడ్డుకున్న వారిని కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కోతకు వెళ్లే ఆవులను ఆపి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చేవారి పైనే ఎదురు కేసులు నమోదు చేయాలని చూస్తున్నారన్నారు.

