January 16, 2026

Tsdreams

INDIAN NEWS NETWORK

మ‌ల్ల‌న్న‌పై కేసీఆర్ మరో కుట్ర

  • పాద‌యాత్ర భ‌గ్నం చేసేందుకు స్కేచ్
  • ఈ నెల 29న ప్రారంభంకానున్న మ‌ల్ల‌న్న‌ పాద‌యాత్ర‌
  • ఇప్పటికే దాదాపు 30 కేసులు దాకా పెట్టిన వైనం
  • పాద‌యాత్ర‌ను డిస్ట‌ర్బ్ చేసేటందుకే కట్టుకథలతో కేసులు
  • ఎన్ని కేసులు పెట్టినా భ‌య‌ప‌డేది లేదన్న‌ : తీన్మార్ మ‌ల్ల‌న్న‌..

హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): తీన్మార్ మల్లన్న నిజాలు చూపెడుతుంటే అధికార పార్టీ లీడర్లకు మింగుడు పడ్తలేనట్టుంది..?? జర్నలిస్టులు ప్రశ్నిస్తే పాపమైతుంది.. ఈ మధ్యకాలంలో తీన్మార్ మల్లన్న మీద, క్యూన్యూస్ మీద వరుస దాడులకు దిగుతున్న కేసీఆర్ ప్రభుత్వం.. మంగళవారం నాడు మరో కుట్రకు పన్నాగం పన్నింది.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఓ పిర్యాదు నమోదయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పై కించపరిచే విధంగా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నయి.. దానికి తీన్మార్ మల్లన్ననే బాధ్యులంటూ కేసీఆర్ భజన బృందం.. అతనిమీద చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు. అక్రమ కేసులు పెడుతూ అణిచివేసే ప్రయత్నం చేస్తున్నా వెనక్కి తగ్గని నైజంతో తీన్మార్ మల్లన్న ప్రజల కోసం చేస్తున్న నిరంతర పోరాటాన్ని ఆపలేదు. ఇలా అక్రమ కేసులు బనాయిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్న ప్రభుత్వంపై తెలంగాణ సమాజం మండిపడుతుంది. కేవలం అధికార పార్టీ అక్రమాలు, అవినీతిని బట్టబయలు చేస్తున్నందుకే ప్రభుత్వం ఈ కుట్రలకు పాల్పడుతుంది. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత వేధించినా నిరంకుశంగా వ్య వహరిస్తున్న ప్రభుత్వానికి భయపడేది లేదు, బేనికేదే లేదని..ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎక్కడి వరకైనా వెళ్తామని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశాడు. తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులలో భాగంగా…వాక్ స్వాతంత్ర్యం, ప్రశ్నించే హక్కు ఉందని, న్యాయస్థానాలపై పూర్తి నమ్మకముందని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.

ఆగ‌స్టు 29న మ‌ల్ల‌న్న సుదీర్ఘ‌ పాద‌యాత్ర ప్రారంభం కాబోతుంది. ఈ పాద‌యాత్ర‌కు సంబంధించి తీన్మార్ మ‌ల్ల‌న్న టీం, అడ్ హ‌క్ క‌మిటీ ఓ కీలక నిర్ణ‌యం కూడా తీసుకుంది. ఈ 29న ఆలంపూర్ నుంచి తీన్మార్ మ‌ల్ల‌న్న పాద‌యాత్ర ప్రారంభించేటందుకు సిద్ధ‌మైతున్న తరుణంలో పోలీసులు పదే పదే అడ్డంకులు సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తుండ్రు. ఇప్ప‌టికే విచార‌ణ పేరుతో చిల‌క‌ల‌గూడ పీఎస్ లో గంట‌ల‌కొద్దీ నిరీక్ష‌ణ, సీసీఎస్ కేసూ, ల్యాబ్ టెక్నిషియన్ ను బేదిరించి, దమ్కీలిచ్చి తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలని జూసింది. అయినా వేటికి బయపడని మల్లన్న.. సర్కార్ తో డీ అంటే డీ అనే స్థాయిలో నేరుగా కేసీఆర్ తోనే సమరం చేస్తుండు. ఇలా, తెలంగాణలో జరుగుతున్న వరుస ఘటనలు, జర్నలిస్ట్ ల మీదనే ఎందుకు అని సామన్య జనం ప్రశ్నిస్తున్నారు. కావాలనే టీఆర్ఎస్ సర్కార్ ఇలాంటి దాడులకు పాల్పడుతూ.. తీన్మార్ మల్లన్న మీద అధికార పార్టీ మరో కుట్రకు తెరలేపడంపై సబ్బండ వర్గాల ప్రజలు మల్లన్న వెంట ఉన్నారని, ఉంటామని చెప్తున్నారు.

పాద‌యాత్ర‌ను డిస్ట‌ర్బ్ చేసేటందుకే : తీన్మార్ మ‌ల్ల‌న్న‌..
ఈ నెల 29న సుదీర్ఘ పాద‌యాత్ర ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించినప్పటికి, పోలీసులు కావాల‌ని అడ్డంకులు సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ర‌ని తీన్మార్ మ‌ల్ల‌న్న అన్నారు. ఇప్ప‌టికే సైబ‌ర్ క్రైమ్ పోలీస్ స్టేష‌న్ కు హాజ‌రయ్యిండ్రు. కావాలని నోటీసులిచ్చిండ్ర‌ని, ఒక‌దాని త‌ర్వాత ఇంకోటి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ర‌ని ఆయ‌న ఆరోపించిండ్రు. ఇలా తనపై పోలీసులు దుర్మార్గ‌మైన కేసులు పెడుతున్న‌ర‌ని చట్ట ప‌రిధి దాటి వ్య‌వ‌హ‌రిస్తే కోర్టుకు వెళ్లాల్సి వ‌స్త‌ద‌ని అన్న‌రు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌భుత్వాన్ని మ‌ల్ల‌న్న హెచ్చ‌రించిండ్రు.

తాటాకు చప్పుళ్లకు వణికేవాడు కాదు? : తెలంగాణ సమాజం.
తీన్మార్ మల్లన్న సబ్బండ వర్గాల గొంతుక.. తాటాకు చప్పుళ్లకు వణికే వాడు కాదు? …! అయన వెనుక నిశబ్ద విప్లవంలా ప్రజా ప్రవాహం ఉంది. జర్నలిస్టు అనే ముసుగు వేసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు? అయన ప్రజా పక్షపాతి ప్రశ్నించే తేరపై అయన ప్రజాపోరాటం …! యూట్యూబ్ అడ్డా కాదు ఆయనది సంబంద్ధవర్గాల ప్రజా అడ్డా ..!
గులాబీ రాబందుల పాలనలో ముఖ్యమంత్రి సక్రమంగా సేవలు చేస్తే ప్రశ్నించే గొంతులు ఎందుకు పుట్టుకొస్తాయి ? ఆవకాశం పాలకులే ఇస్తున్నారు? అన్న ఇంగిత గ్యానం లేని టీఆర్ఎస్ చెంచాలు, భజనపరులు చేసే నిందారోపణలకు తీన్మార్ మల్లన్న జంకాల్సిన భయపడాల్సిన అవసరం ఆయనకు లేదని హెచ్చరించాల్సి వస్తుంది…

మల్లన్నపై కేసులు, వేదింపులు అపాలి : టీ.జర్నలిస్టుల ఫోరం..
సీఎం కేసీఆర్ అవినీతి, అక్రమాలను ఎండగడుతూ ప్రశ్నిస్తున్న మల్లన్నపై ప్రభుత్వం కుట్రలు పన్ని దురుద్దేశ పూర్వకంగానే కేసులు పెడుతూ వేధిస్తుండడాన్ని టీ.జర్నలిస్టుల ఫోరం తీవ్రంగా ఖండించింది. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో జరుగుతున్న తప్పిదాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్న మల్లన్నపై కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. 7200 పాదయాత్రను అడ్డుకోవాలనే కుట్రలతో వరుసగా కేసులు పెడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న తీరుపై వారు తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికైనా వేదింపులు అపాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.