రేపు భద్రాద్రికి గవర్నర్
ముంపు గ్రామాల్లో తమిళ్ సై పర్యటన
రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ రేపు భద్రాచలంలో పర్యటించనున్నారు. భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 70 అడుగులు దాటిపోయింది. దీంతో ఊర్లు అన్ని జలదగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇవాళ రాత్రి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ లో భద్రాచలం వెళ్లనున్నారు. ముంపు గ్రామాల్లో వరద పరిస్థితులను గవర్నర్ పరిశీలించనున్నారు. భద్రాచలం టౌన్ తో పాటు చుట్టు పక్కల ముంపు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. భద్రాచలం దగ్గర 36 ఏళ్ల తర్వాత గోదావరి నీటిమట్టం ఆ స్థాయిలో వచ్చింది. భద్రాచలం నుంచి వెళ్లే అన్ని మార్గాలనూ గోదావరి చుట్టుముట్టింది. వరద ప్రభావంతో చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, మణుగూరు, పినపాక మండలాల్లో వందకు పైగా గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
