హుజురాబాద్ లో కాషాయ జెండా ఎగిరేది ఖాయం
కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసిన, ఇంటెలిజెన్స్ వర్గాలతో చేయించిన విజయం అపలేరు? : బండి సంజయ్
కరీంనగర్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): హుజూరాబాద్ లో జరగనున్న ఉప ఎన్నికలకు టీఆర్ఎస్ కు అభ్యర్థే కరువయ్యాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ పక్షాన ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాలతో చేయించిన సర్వేలోనూ 71 శాతం మంది ఓటర్లు బీజేపీ అభ్యర్ధి ఈటలకు మద్దతిస్తున్నట్లు తేలిందన్నారు. సర్వేలతో బెంబేలెత్తిన కేసీఆర్.. వార్డు మెంబర్ మొదలు ప్రజా ప్రతినిధులందరికీ లక్షలాది రూపాయల ఆశ చూపి టీఆర్ఎస్ లోకి లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్ లో కాషాయ జెండా ఎగురడం ఖాయమని బండి తేల్చి చెప్పారు
