గాంధీ ICUలో రోగులకు ధైర్యం చెప్పిన కేసీఆర్
హైదరాబాద్ (టీఎస్ డ్రీమ్స్ న్యూస్ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఆయన కాసేపటి క్రితమే ఆసుపత్రికి చేరుకున్నారు. కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలను ఆయన స్వయంగా పరిశీలించారు. హాస్పటల్లో కొవిడ్ చికిత్స పొందుతున్న బాధితులకు సంబంధించి ఆయన స్వయంగా విషయాలను తెలుసుకున్నారు. అనంతరం అక్కడి సదుపాయాలపై అధికారులతో సమీక్షించినట్టు తెలుస్తోంది. ఇక సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావుతో పాటు సీఎస్ సోమేష్ కుమార్ ఇతర వైద్య అధికారులు ఉన్నారు.
ఇక గాంధి ఆసుపత్రులోని లైబ్రరీని కూడ 300 బెడ్స్ గా కోవిడ్ సెంటర్‌గా మార్చనున్నట్టు తెలుస్తోంది. దీన్ని సీఎం పరీశీంచారు. ఐసీయూ వార్డులోకి సీఎం కేసీఆర్ వెళ్లి ముఖ్యమంత్రి నేరుగా కొవిడ్ రోగులను పరామర్శించారు. మరోవైపు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సంధర్బంగా గాంధీలో సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు. ఔట్ పేషంట్లకు అందుతున్న వేద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే సీఎం కేసీఆర్ మొదటి సారి గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే.